Breaking News

IPL 2026: సన్‌రైజర్స్‌కు కష్టమే!

Published on Thu, 03/12/2026 - 18:30

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 ఆరంభానికి రంగం సిద్దమైంది. మార్చి 28న క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తాజా ఎడిషన్‌కు తెరలేవనుంది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఇందుకు సంబంధించి తొలి విడత షెడ్యూల్‌ను బుధవారం ప్రకటించింది.

ఇరవై మ్యాచ్‌ల షెడ్యూల్‌ మాత్రమే
ఓవైపు ఇరాన్‌తో ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. మరోవైపు.. తమిళనాడు, అసోం, బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేవలం 20 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ విడుదల చేసింది.

ఇందులో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) జట్టు తొలి మ్యాచ్‌లో మార్చి 28న డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB)తో తలపడుతుంది. ఇందుకు బెంగళూరు వేదిక. 

ఇక రెండో మ్యాచ్‌లో ఏప్రిల్‌ 2న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో కోల్‌కతాలో.. తదుపరి ఏప్రిల్‌ 5న హైదరాబాద్‌తో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో.. అనంతరం ఏప్రిల్‌ 11న పంజాబ్‌ కింగ్స్‌తో న్యూ చండీగఢ్‌లో తలపడనుంది.

ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా సన్‌రైజర్స్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి విడత షెడ్యూల్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లు సొంత మైదానం వెలుపల ఆడటం తలనొప్పిగా మారుతుందన్నాడు.

సన్‌రైజర్స్‌కు కష్టమే!
‘‘గుజరాత్‌ టైటాన్స్‌తో పాటు సన్‌రైజర్స్‌ తొలి నాలుగు మ్యాచ్‌లలో మూడు సొంత మైదానంలో కాకుండా.. ఇతర వేదికలపై ఆడాల్సి ఉంది. నాకైతే సన్‌రైజర్స్‌ గురించే బాధంతా!

వాళ్లకు ఫ్లాట్‌ పిచ్‌లు కావాలి. కానీ ఆయా వేదికల్లో వీరి కోసం ఎవరూ ఇలాంటి పిచ్‌ను తయారు చేయలేరు. సొంత మైదానంలో ఒకే ఒక్క మ్యాచ్‌.. అది కూడా మధ్యాహ్నం షెడ్యూల్‌ చేశారు. నిజానికి సన్‌రైజర్స్‌కు హోం గ్రౌండ్‌లో సీజన్‌ ఆరంభించడమే మంచిది.

అక్కడైతే వారు శుభారంభం అందుకోగలరు. వారి విజయాలు, ఆత్మవిశ్వాసంపై ఇది కచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా సన్‌రైజర్స్‌లో అభిషేక్‌ శర్మ, ట్రవిస్‌ హెడ్‌, ఇషాన్‌ కిషన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ వంటి విధ్వంసకర వీరులు ఉన్న విషయం తెలిసిందే. 

చదవండి: IPL 2026: సన్‌రైజర్స్‌ షెడ్యూల్‌ ఇదే..!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)