Breaking News

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌.. కామెంటేటర్‌గా టీమిండియా స్టార్‌ ఆటగాడు

Published on Tue, 07/11/2023 - 11:55

టీమిండియా వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ సరికొత్త అవతరమెత్తున్నాడు. గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న ఇషాంత్‌.. కామెంటేటర్‌గా తన కొత్త జర్నీని ప్రారంభించనున్నాడు. వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు తొలి సారి కామెంటేటర్‌గా ఇషాంత్‌ శర్మ వ్యవహరించనున్నాడు. ఈ మెరకు జియో సినిమాతో ఇషాంత్‌ శర్మ ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఈ విషయాన్ని జియో సినిమా సోమవారం దృవీకరించింది. గతంలో వెస్టిండీస్‌పై ఇషాంత్‌ సాధించిన 10 వికెట్ల హాల్‌ను హైలైట్ చేస్తూ ఓ వీడియోను జియో సినిమా ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. అదే విధంగా ఇషాంత్‌ తమ కామెంటరీ ప్యానెల్‌లో చేరడం చాలా సంతోషంగా ఉందని జియో సినిమా రాసుకొచ్చింది. కాగా ఈ వెటరన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ హిందీలో తన వాఖ్యాన్ని అందించనున్నాడు.

ఇక ఇషాంత్‌ శర్మ కొన్నాళ్లపాటు భారత జట్టులో కీలక సభ్యునిగా కొనసాగాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో భారత జట్టుకు తన సేవలను అందించాడు. టీమిండియా తరపున ఇప్పటివరకు 105 టెస్టులు, 80 వన్డేలు, 14 టీ20లు ఆడిన ఇషాంత్‌.. వరుసగా 311, 115, 8 వికెట్లు పడగొట్టాడు.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కొత్త సైకిల్‌లో భాగంగా జరగనున్న భారత్‌-విండీస్‌ టెస్టు సిరీస్‌ జూలై 12 నుంచి ప్రారంభం కానుంది. డొమినికా వేదికగా జరగనున్న తొలి టెస్టుకు ఇరు జట్లు అన్ని విధాల సిద్దమయ్యాయి. తొలి మ్యాచ్‌లో గెలిచి డబ్ల్యూటీసీ సైకిల్‌ 2023-25లో బోణీ కొట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.

విండీస్‌తో టెస్టులకు భారత  జట్టు: 
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్‌ కెప్టెన్‌), కేఎస్ భరత్ (వికెట్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్‌ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్‌, నవదీప్ సైనీ.
చదవండి:
 IND vs WI: విండీస్‌లో కారు డ్రైవింగ్‌ చేసిన రోహిత్‌ శర్మ! ఫోటోలు వైరల్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)