Breaking News

విరాట్‌ రికార్డు బద్దలు కొట్టిన ఇషాన్

Published on Sun, 07/26/2026 - 11:40

జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 44 బంతుల్లో 81 పరుగులు (9 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసిన అతను.. ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక అంతర్జాతీయ టీ20 పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లిని అధిగమించాడు. 

తాజా ఇన్నింగ్స్‌తో ఈ ఏడాది ఇషాన్‌ టీ20 పరుగుల సంఖ్య 783 పరుగులకు చేరగా.. 2022లో విరాట్ 781 పరుగులు చేశాడు. ఈ జాబితాలో పాక్‌ ఆటగాడు మహ్మద్‌ రిజ్వాన్‌ (2021లో 1326 పరుగులు) టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. భారత్‌ తరఫున మాజీ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (2022లో 1164 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. 

ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ ఈ ఏడాది స్కై రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. మరో 381 పరుగులు చేస్తే స్కై రికార్డు.. మరో 543 పరుగులు చేస్తే మహ్మద్ రిజ్వాన్‌ను కూడా అధిగమించి ప్రపంచ రికార్డు నెలకొల్పవచ్చు.

భారత్‌కు ఈ ఏడాది ఇంకా వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంకలతో టీ20 సిరీస్‌లు ఉండటంతో పాటు ఆసియా క్రీడల్లో కూడా ఆడే అవకాశం ఉంది. దీంతో ఇషాన్ కిషన్‌కు ఈ రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టీ20 అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాళ్లు:
* 1326 – మహ్మద్ రిజ్వాన్ (2021)
* 1164 – సూర్యకుమార్ యాదవ్ (2022)
* 996 – మహ్మద్ రిజ్వాన్ (2022)
* 939 – బాబర్ ఆజమ్ (2021)
* 936 – బ్రియాన్ బెన్నెట్ (2025)
* 859 – అభిషేక్ శర్మ (2025)
* 783 – ఇషాన్ కిషన్ (2026)
* 781 – విరాట్ కోహ్లీ (2022)

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఇషాన్‌ రికార్డు ఇన్నింగ్స్‌ కారణంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ భారీ స్కోరు (219-5) సాధించింది. అనంతరం అభిషేక్‌ మూడు, యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయడంతో జింబాబ్వే 129 పరుగులకే ఆలౌటై, 90 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. 

ఫలితంగా భారత్‌ మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ టీమిండియానే గెలిచింది. నామమాత్రపు మూడో టీ20 ఇవాళే (జులై 26) జరుగనుంది. భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్‌ అ‍య్యర్‌కు ఇది తొలి సిరీస్‌ విజయం.

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)