Breaking News

ఆసీస్‌ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. ఆంధ్ర ప్లేయర్లకు చోటు

Published on Tue, 10/22/2024 - 07:48

ఆస్ట్రేలియా గడ్డపై జరిగే రెండు ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లలో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. 15 మంది సభ్యుల ఈ  రుతురాజ్‌ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇద్దరు ఆంధ్ర ఆటగాళ్లు నితీశ్‌ కుమార్‌ రెడ్డి, రికీ భుయ్‌లకు ఇందులో చోటు లభించింది.

భారత సీనియర్‌ టీమ్‌లో స్థానం కోల్పోయిన ఇషాన్‌ కిషన్‌కు ఈ జట్టులో అవకాశం దక్కడం విశేషం. ఈ టూర్‌లో భాగంగా ఆ్రస్టేలియా ‘ఎ’తో మెకే, మెల్‌బోర్న్‌లలో భారత్‌ ‘ఎ’ నాలుగు రోజుల మ్యాచ్‌లు రెండు ఆడుతుంది. 

ఆ తర్వాత టెస్టు సిరీస్‌ కోసం సిద్ధమవుతున్న భారత సీనియర్‌ టీమ్‌తో పెర్త్‌లో మూడు రోజుల మ్యాచ్‌లో కూడా తలపడుతుంది. ‘ఎ’ జట్టు ప్రదర్శన ద్వారా కూడా బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ కోసం కూడా ఒకరిద్దరు ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం ఉంది.  

భారత ‘ఎ’ జట్టు వివరాలు: రుతురాజ్‌ గైక్వాడ్‌ (కెప్టెన్‌), అభిమన్యు ఈశ్వరన్‌ (వైస్ కెప్టెన్‌), సాయిసుదర్శన్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, దేవ్‌దత్‌ పడిక్కల్, రికీ భుయ్, బాబా ఇంద్రజిత్, ఇషాన్‌ కిషన్, అభిషేక్‌ పొరేల్, ముకేశ్‌ కుమార్, ఖలీల్‌ అహ్మద్, యశ్‌ దయాళ్, నవదీప్‌ సైనీ, మానవ్‌ సుథార్, తనుశ్‌ కొటియాన్‌.
చదవండి: అభిషేక్‌ శర్మ ఊచకోత.. యూఏఈపై టీమిండియా ఘన విజయం

Videos

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు