Breaking News

కెప్టెన్‌గా ఇషాన్‌ కిషన్‌.. జట్టులో వైభవ్‌ సూర్యవంశీ, రియాన్‌ పరాగ్‌

Published on Fri, 08/01/2025 - 20:35

త్వరలో ప్రారంభం కానున్న దులీప్‌ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల ఈస్ట్‌ జోన్‌ జట్టును ఇవాళ (ఆగస్ట్‌ 1) ‍ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టీమిండియా పాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీగా (వైస్‌ కెప్టెన్‌) ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న అభిమన్యు ఈశ్వరన్‌ వ్యవహరించనున్నాడు.

ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపిక కాని మొహమ్మద్‌ షమీ ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. షమీ తన బెంగాల్‌ సహచరుడు ముకేశ్‌ కుమార్‌, ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న ఆకాశ్‌దీప్‌తో కలిసి పేస్‌ బౌలింగ్‌ బాధ్యతలను పంచుకోనున్నాడు.

జట్టులో అసోం సారధి, రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ కూడా చోటు దక్కించుకున్నాడు. భారత యువ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ రిజర్వ్‌ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టుకు సారధిగా ఎంపికైన ఇషాన్‌ ఇటీవల ఇంగ్లండ్‌ కౌంటీల్లో విశేషంగా రాణించాడు. 

ఇంగ్లండ్‌ పర్యటనలో రిషబ్‌ పంత్‌ గాయపడటంతో అతనికి ప్రత్యామ్నాయంగా ఇషాన్‌ను సంప్రదించినప్పటికీ.. అతను కూడా గాయంతో బాధపడుతున్నట్లు తెలిపాడు. దీంతో పంత్‌కు ప్రత్యామ్నాయంగా ఎన్‌ జగదీశన్‌ను ఎంపిక చేశారు.

దులీప్‌ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్ జట్టు- ఇషాన్ కిషన్ (wk/c), అభిమన్యు ఈశ్వరన్, సందీప్ పట్నాయక్, విరాట్ సింగ్, డెనిష్ దాస్, శ్రీరామ్ పాల్, శరణ్‌దీప్ సింగ్, కుమార్ కుషాగ్రా, రియాన్ పరాగ్, ఉత్కర్ష్ సింగ్, మనీషి, సూరజ్ జైస్వాల్, ముఖేష్ కుమార్, ఆకాశ్‌దీప్, మొహమ్మద్‌  షమీ

స్టాండ్‌బై ప్లేయర్‌లు- ముఖ్తార్ హుస్సేన్, ఆశీర్వాద్ స్వైన్, వైభవ్ సూర్యవంశీ, స్వస్తిక్ సమాల్, సుదీప్ కుమార్ ఘరామి, రాహుల్ సింగ్

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)