Breaking News

ఇంగ్లండ్‌ గడ్డపై ఇరగదీస్తున్న ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ

Published on Tue, 07/01/2025 - 20:22

ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో టీమిండియా యువ బ్యాటర్లు ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ దుమ్మురేపుతున్నారు. కొద్ది రోజుల కిందటే కౌంటీ అరంగేట్రం చేసిన ఈ ఇద్దరు.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అదరగొట్టారు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌ కోసం హ్యాంప్‌షైర్‌తో ఒప్పందం చేసుకున్న తిలక్‌ వర్మ అరంగేట్రం మ్యాచ్‌లో అద్బుతమైన సెంచరీతో (241 బంతుల్లో 100) కదంతొక్కగా.. ఇదే టోర్నీ కోసం​ నాటింగ్హమ్‌షైర్‌తో ఒప్పందం చేసుకున్న ఇషాన్‌ కిషన్‌ అరంగేట్రం మ్యాచ్‌లో మెరుపు హాఫ్‌ సెంచరీ (98 బంతుల్లో 87) చేశాడు.

తాజాగా ఈ ఇద్దరు తమతమ రెండో మ్యాచ్‌ల్లో కూడా సత్తా చాటారు. సోమర్‌సెట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ (128 బంతుల్లో 77; 8 ఫోర్లు, 2 సిక్సర్లు).. వార్సెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్‌ వర్మ (171 బంతుల్లో 56; 7 ఫోర్లు, సిక్స్‌) అర్ద సెంచరీలతో రాణించారు. కౌంట్లీ ఈ ఇద్దరు యువ బ్యాటర్లు చెలరేగడం చూస్తుంటే టీమిండియా టెస్ట్‌ బెర్త్‌ల కోసం​ పోటీ మరింత తీవ్రతరమయ్యేలా కనిపిస్తుంది. 

తాజా కౌంటీ ఛాంపియన్‌షిప్‌లోనే మరో టీమిండియా ఆటగాడు కూడా అరంగేట్రం చేశాడు. భారత లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ ఎసెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఖలీల్‌ తన తొలి మ్యాచ్‌లోనే (యార్క్‌షైర్‌) ఆకట్టుకున్నాడు. ఖలీల్‌ స్టార్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టోతో జరిగిన పోటీలో పైచేయి సాధించాడు. తొలుత బెయిర్‌స్టో ఖలీల్‌ బౌలింగ్‌లో బౌండరీలు బాదగా.. ఆతర్వాత ఖలీల్‌ అతన్ని ఔట్‌ చేసి రివెంజ్‌ తీర్చుకున్నాడు.

కాగా, ఈ కౌంటీ సీజన్‌లో ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ, ఖలీల్‌ అహ్మద్‌తో పాటు మరో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు కూడా ఆడుతున్నారు. యువ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ యార్క్‌షైర్‌కు.. స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌ నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి