Breaking News

అతడి కారణంగానే రాజ్‌కోట్‌లో ఓడిపోయాం: ఇర్ఫాన్‌ పఠాన్‌

Published on Fri, 01/16/2026 - 19:06

రాజ్‌కోట్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 285 పరుగుల లక్ష్యాన్ని భారత బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్లు కూడా దారుణంగా విఫలమయ్యారు.

భారత బౌలర్లు కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టారు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాట్‌తో పాటు బంతితో విఫలమైన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై పఠాన్‌ విమర్శలు గుప్పించాడు. జడేజా నెమ్మదిగా ఆడడమే వల్లే భారత్ 300 పరుగులు దాటలేకపోయిందని పఠాన్ అభిప్రాయపడ్డాడు.

రాజ్‌కోట్ వన్డేలో భారత్ స్కోర్ సునాయసంగా 300 పరుగుల మార్క్ దాటి ఉండేది. ఎల్ రాహుల్ అద్భుతంగా ఆడి 90 స్ట్రైక్ రేట్‌తో సెంచరీ చేస్తే.. జడేజా మాత్రం తన సొంత మైదానంలో  60 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. కనీసం 80 స్ట్రైక్ రేట్‌తో ఆడి ఉంటే భారత్ అదనంగా మరో 20-30 పరుగులు వచ్చేవి. జడేజా అద్భుతమైన ఆల్‌రౌండర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.

టెస్ట్ క్రికెట్‌లో కపిల్ దేవ్ తర్వాత అంత పేరు తెచ్చుకున్న ఆల్‌రౌండర్‌గా జడ్డూ నిలిచాడు. కానీ వన్డేల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. కనీసం స్ట్రైక్ రొటేట్ చేయడానికి కూడా అతడు కష్టపడుతున్నాడు.

2020 తర్వాత జడేజా వన్డేల్లో ఇప్పటివరకు కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. గత ఐదు మ్యాచ్‌లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఒక సీనియర్ ఆటగాడి నుంచి ఇలాంటి ప్రదర్శనలు జట్టుకు అస్సలు మం‍చిది కాదు. జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను ఆడించడం బెటర్ అని తన యూట్యూబ్ ఛానల్‌లో పఠాన్ పేర్కొన్నాడు.
చదవండి: అతడొక అద్భుతం.. కనీసం మూడో మ్యాచ్‌లోనైనా ఆడించండి: అశ్విన్‌
 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)