Breaking News

'సంజూకు కాదు.. ఆ కుర్రాడికే టీమిండియాలో ఛాన్స్‌లు ఎక్కువ‌'

Published on Mon, 07/29/2024 - 16:06

ప‌ల్లెకెలె వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన రెండో టీ20లో భార‌త్ 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలూండ‌గానే 2-0 తేడాతో సొంతం చేసుకుంది. కెప్టెన్‌గా సూర్య‌కుమార్ యాద‌వ్‌, హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ తొలి సిరీస్ విజ‌యాన్ని అందుకున్నారు. 

ఇక ఇది ఇలా ఉండ‌గా.. టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ మ‌రోసారి త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని అందిపుచ్చుకోలేక‌పోయాడు. శ్రీలంక‌తో జ‌రిగిన తొలి టీ20లో బెంచ్‌కే ప‌రిమిత‌మైన శాంస‌న్‌కు.. రెండో టీ20లో ఆడే ఛాన్స్ ల‌భించింది. గిల్ స్ధానంలో ఓపెన‌ర్‌గా వ‌చ్చిన శాంస‌న్‌.. గోల్డెన్ డ‌క్‌గా వెనుదిరిగాడు.

ఈ క్ర‌మంలో భారత మాజీ ఆల్‌రౌండ‌ర్ ఇర్ఫాన్ పఠాన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. భార‌త జ‌ట్టులో శాంస‌న్ కంటే యువ ఆల్‌రౌండ‌ర్ రియాన్ ప‌రాగ్‌కే ఎక్కువ అవ‌కాశాలు ద‌క్కుతాయ‌ని ప‌ఠాన్ జోస్యం చెప్పాడు. కాగా లంక‌తో జ‌రిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ రియాన్  భార‌త జ‌ట్టులో భాగమ‌య్యాడు. మొద‌టి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫ‌ల‌మై ప‌రాగ్‌.. బౌలింగ్‌లో మాత్రం 3 వికెట్లతో స‌త్తాచాటాడు. రెండో మ్యాచ్‌లోనూ త‌న 4 ఓవ‌ర్ల బౌలింగ్ కోటాను ఈ అస్సాం ఆల్‌రౌండ‌ర్ పూర్తి చేశాడు.

"భార‌త జ‌ట్టులో రియాన్ ప‌రాగ్‌కు ఎక్కువ‌గా అవ‌కాశాలు ల‌భిస్తాయి. ఎందుకంటే టీమిండియా టాప్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ల‌లో ఎవ‌రికి బౌలింగ్ చేసే సామర్థ్యం లేదు. అదే అత‌డికి బాగా క‌లిసిస్తోంద‌ని" ఎక్స్‌లో ప‌ఠాన్ రాసుకొచ్చాడు. ఐపీఎల్‌-2024లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో ప‌రాగ్‌కు భార‌త జ‌ట్టులో చోటు ద‌క్కింది. టీమిండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ కూడా ప‌రాగ్‌ను ఎక్స్ ఫ్యాక్ట‌ర్ అని కొనియాడాడు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)