Breaking News

IPL 2024: ఆర్సీబీ, స‌న్‌రైజ‌ర్స్ కాదు.. ప్లే ఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవే?

Published on Fri, 03/22/2024 - 18:11

ప్ర‌పంచంలోనే అతి పెద్ద క్రికెట్ లీగైన ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు మ‌రో రెండు గంట‌ల్లో తెరలేవ‌నుంది. చెపాక్‌ వేదిక‌గా  చెన్నై సూప‌ర్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు  మ‌ధ్య జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది.

ఈ క్ర‌మంలో ఈ ఏడాది ప్లే ఆఫ్స్‌కు చేరే నాలుగు జ‌ట్ల‌ను భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అంచ‌నా వేశాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు ప్లే ఆఫ్స్ చేరుతాయని తెలిపాడు.

"ప్ర‌స్తుత జ‌ట్ల బలాలు, బలహీనతలను చూస్తే ఆ నాలుగు జ‌ట్లు ప్లే ఆఫ్స్‌కు చేరే అవ‌కాశ‌ముంది. అందులో మొద‌టిది ముంబై ఇండియ‌న్స్‌. ముంబై ఇండియ‌న్స్ చాలా బ‌లంగా క‌న్పిస్తోంది. ఆ త‌ర్వాత రెండో జ‌ట్టు చెన్నై సూప‌ర్ కింగ్స్‌.  సీఎస్‌కేకు చాలా మంది స్టార్ ఆట‌గాళ్లు దూరంగా ఉన్న‌ప్ప‌టికి ఆ జ‌ట్టు మాత్రం ఎలాగైనా ముందుడగు వేస్తోంది.

డెవాన్ కాన్వే గాయం కార‌ణంగా దూర‌మ‌య్యాడు. దీప‌క్ చాహ‌ర్ గాయం నుంచి కోలుకుని తిరిగివ‌చ్చాడు. ఏదమైన‌ప్ప‌టికి ధోనీ చరిష్మాతో ముందుకు సాగుతోంది. ఎంఎస్ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న‌ప్ప‌టికీ త‌న అనుభ‌వంతో జ‌ట్టును ముందుకు న‌డిపిస్తాడు. ఇక మూడో జ‌ట్టు లక్నో సూపర్ జెయింట్స్.

ఈ సారి ల‌క్నో కూడా చాలా ప‌టిష్టంగా క‌న్పిస్తోంది. రాహుల్ గాయం నుంచి కోలుకుని రావ‌డం ఆ జ‌ట్టుకు క‌లిసిస్తోంది. చివ‌ర‌గా నాలుగో జ‌ట్టుగా కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించే ఛాన్స్ ఉంది. కేకేఆర్‌లో కూడా ర‌స్సెల్‌,  మంచి ప‌వ‌ర్ హిట్ట‌ర్లు ఉన్నార‌ని" స్టార్‌స్పోర్ట్స్ షోలో పఠాన్ పేర్కొన్నాడు. కాగా ఇర్ఫాన్ త‌న ఎంచుకున్న జ‌ట్ల‌లో ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్ పేర్లు లేక‌పోవ‌డం గ‌మనార్హం.

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?