Breaking News

ఇంగ్లండ్‌పై ఐర్లాండ్‌ సంచలన విజయం

Published on Mon, 09/16/2024 - 08:18

మహిళల టీ20 క్రికెట్‌లో పసికూన ఐర్లాండ్‌ పటిష్టమైన ఇంగ్లండ్‌ జట్టుకు ఊహించని షాకిచ్చింది. నిన్న (సెప్టెంబర్‌ 15) జరిగిన ఉత్కంఠ పోరులో ఐర్లాండ్‌ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ఓర్లా ప్రెండర్‌గాస్ట్‌ ఆల్‌రౌండ్‌ షోతో (2/31, 51 బంతుల్లో 80; 13 ఫోర్లు) అదరగొట్టి ఐర్లాండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. 

ఆఖరి ఓవర్‌లో ఐర్లాండ్‌ గెలుపుకు ఏడు పరుగులు అవసరం కాగా.. మ్యాడీ విలియర్స్‌ (ఇంగ్లండ్‌ బౌలర్‌) వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి భయపెట్టింది. అయినా ఐర్లాండ్‌ ఐదో బంతికి రెండు పరుగులు రాబట్టి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. టీ20ల్లో ఇంగ్లండ్‌పై ఐర్లాండ్‌కు ఇది తొలి విజయం. ఈ గెలుపుతో ఐర్లాండ్‌ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. బేమౌంట్‌ (40), స్కోల్‌ఫీల్డ్‌ (34), బ్రైయోనీ స్మిత్‌ (28), జార్జియా ఆడమ్స్‌ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఐర్లాండ్‌ బౌలర్లలో ప్రెండర్‌గాస్ట్‌, ఆర్లీన్‌ కెల్లీ, ఆమీ మాగ్యూర్‌ తలో రెండు వికెట్లు తీశారు.

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్‌.. మరో బంతి మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ప్రెండర్‌గాస్ట్‌ (80).. గ్యాబీ లెవిస్‌ (38), లియా పాల్‌ (27 నాటౌట్‌) సహకారంతో ఐర్లాండ్‌ను గెలిపించింది. 

చివరి ఓవర్‌లో కాసేపు నాటకీయ పరిణామాలు (ఐర్లాండ్‌ రెండు వికెట్లు కోల్పోయింది) చోటు చేసుకున్నప్పటికీ అంతిమంగా ఐర్లాండ్‌నే విజయం వరించింది. ఐర్లాండ్‌ దీనికి ముందు జరిగిన వన్డే సిరీస్‌లోనూ ఓ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు షాకిచ్చింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి వన్డేలో ఐర్లాండ్‌ ఇంగ్లండ్‌ను ఓడించింది. ఆ సిరీస్‌ను ఇంగ్లండ్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

చదవండి: ఇంగ్లండ్, ఆ్రస్టేలియా మధ్య చివరి టి20 రద్దు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)