ఐర్లాండ్‌-ఆఫ్ఘనిస్తాన్‌ తొలి మ్యాచ్‌ రద్దు

Published on Wed, 08/05/2026 - 18:01

ఐర్లాండ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య బ్రెడీ వేదికగా ఇవాళ (ఆగస్ట్‌ 5) జరగాల్సి ఉన్న తొలి వన్డే వర్షం కారణంగా టాస్‌ కూడా పడకుండానే రద్దైంది. స్థానిక కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 10:45 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో 12:27 గంటల సమయంలో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

ఈ మ్యాచ్‌ ఐర్లాండ్‌ కొత్త ప్రధాన కోచ్‌ గ్యారీ విల్సన్‌కు తొలి మ్యాచ్‌ కావాల్సింది. 2025 మే తర్వాత ఐర్లాండ్‌ ఆడుతున్న తొలి 50 ఓవర్ల మ్యాచ్‌ కూడా ఇదే. వర్షం కారణంగా ఈ రెండు సందర్భాలు వాయిదా పడ్డాయి. జూన్‌లో భారత్‌పై 2-0తో టీ20 సిరీస్‌ విజయం సాధించిన తర్వాత ఐర్లాండ్‌ ఆడాల్సిన తొలి  అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా ఇదే.

కాగా, ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం​ ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని మిగతా నాలుగు వన్డేలు ఆగస్ట్‌ 7, 10, 12, 14 తేదీల్లో జరుగనున్నాయి. రెండో వన్డే బ్రెడీలో, ఆఖరి మూడు వన్డేలు బెల్‌ఫాస్ట్‌లో షెడ్యూలయ్యాయి.

క్రికెట్‌ ఐర్లాండ్‌ అసంతృప్తి
ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాల నేపథ్యంలో ఆ దేశానికి ఆతిథ్యం ఇవ్వడంపై ఐర్లాండ్‌ క్రికెట్‌ అసౌకర్య​ం వ్యక్తం చేసింది. ఆ దేశ క్రికెట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సారా కీన్‌ ఈ విషయమై నైతిక అసౌకర్యం ఉందని గతంలోనే పేర్కొంది. అయినప్పటికీ, నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఐర్లాండ్‌ ఈ సిరీస్‌కు ఆతిథ్యం ఇస్తోంది.

 

Videos

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)