Breaking News

ఐర్లాండ్‌ క్రికెట్‌ జట్టుకు జరిమానా

Published on Fri, 01/17/2025 - 08:25

రాజ్‌కోట్‌: భారత పర్యటనలో ఐర్లాండ్‌ మహిళల క్రికెట్‌ జట్టుపై జరిమానా పడింది. భారత మహిళల జట్టుతో బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో ఐర్లాండ్‌ జట్టు మందకొడిగా బౌలింగ్‌ చేసింది. దీంతో జట్టు ప్లేయర్ల మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధించారు. నిర్ణీత సమయంలో పూర్తి ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయింది. రెండు ఓవర్లు ఆలస్యం కావడంతో మ్యాచ్‌ రిఫరీ జి.ఎస్‌.లక్షి... ఐర్లాండ్‌ కెప్టెన్‌ గాబీ లూయిస్‌ వివరణ అనంతరం జరిమానా ఖరారు చేసింది. 

‘అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నియమావళిలోని 2.22 ఆర్టికల్‌ ప్రకారం, కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోతే ఓవర్‌కు 5 శాతం చొప్పున మొత్తం పదిశాతం మ్యాచ్‌ ఫీజులో కోత విధించాం’ అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. మూడు వన్డేల సిరీస్‌ను స్మృతి మంధాన నేతృత్వంలోని భారత జట్టు 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆఖరి పోరులో అయితే అమ్మాయిలు ఆకాశమే హద్దుగా చెలరేగి ఏకంగా 435/5 భారీస్కోరు చేసింది. ఓపెనర్లు మంధాన, ప్రతీకలిద్దరు శతకాలతో కదంతొక్కారు. ఐర్లాండ్‌ను భారత బౌలర్లు 31.4 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూల్చడంతో టీమిండియా  304 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయాన్ని నమోదు చేసింది.       

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)