Breaking News

జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకున్న ఐర్లాండ్‌

Published on Sun, 02/16/2025 - 21:15

తొలి వన్డేలో జింబాబ్వే చేతిలో ఎదురైన ‍పరాభవానికి ఐర్లాండ్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఇవాళ (ఫిబ్రవరి 16) జరిగిన రెండో వన్డేలో ఐర్లాండ్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 49 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. వెస్లీ మెదెవెరె (61), సికందర్‌ రజా (58) అర్ద సెంచరీలతో రాణించి జింబాబ్వేకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు. 

వెల్లింగ్టన్‌ మసకద్జ (35), బ్రియాన్‌ బెన్నెట్‌ (30) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. బెన్‌ కర్రన్‌ (18), కెప్టెన్‌ క్రెయిగ్‌ ఎర్విన్‌ (4), జోనాథన్‌ క్యాంప్‌బెల్‌ (2), టి మరుమణి (0), ముజరబానీ (0), ట్రెవర్‌ గ్వాండు (2) నిరాశపరిచారు. ఐర్లాండ్‌ బౌలర్లలో మార్క్‌ అదైర్‌ నాలుగు, కర్టిస్‌ క్యాంఫర్‌ మూడు వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాశించారు. హ్యూమ్‌, జాషువ లిటిల్‌, ఆండీ మెక్‌బ్రైన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్‌.. 48.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్‌ పాల్‌ స్టిర్లింగ్‌ (89), వన్‌డౌన్‌ బ్యాటర్‌ కర్టిస్‌ క్యాంఫర్‌ (63) అర్ద సెంచరీలతో రాణించి ఐర్లాండ్‌ విజయానికి గట్టి పునాదాలు వేశారు. లోర్కాన్‌ టక్కర్‌ (36 నాటౌట్‌), జార్జ్‌ డాక్రెల్‌ (20 నాటౌట్‌) ఐర్లాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. 

ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో ఆండ్రూ బల్బిర్నీ (11), హ్యారీ టెక్టార్‌ (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో గ్వాండు 2, నగరవ, ముజరబానీ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ గెలుపుతో ఐర్లాండ్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో జింబాబ్వే ఆధిక్యాన్ని 1-1కి తగ్గించింది. ఈ సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో వన్డే ఫిబ్రవరి 18న జరుగనుంది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)