Breaking News

IRE Vs ZIM: బౌండరీని ఆపబోతే ఇలా అయ్యిందేంటి..?

Published on Sun, 07/28/2024 - 20:12

ఐర్లాండ్‌, జింబాబ్వే మధ్య జరిగిన ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో ఓ ఆరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆట నాలుగో రోజు ఐర్లాండ్‌ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. ఫీల్డర్‌ బౌండరీని ఆపబోతే బ్యాటర్లు ఐదు పరుగులు తీశారు. ఈ ఆసక్తికర పరిణామానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతంది.

వివరాల్లోకి వెళితే.. 158 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్‌ 5 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఈ దశలో రిచర్డ్‌ నగరవ బౌలింగ్‌లో ఆండీ మెక్‌బ్రైన్‌ కవర్‌ డ్రైవ్‌ ఆడగా.. టెండాయ్‌ చటార బౌండరీ లైన్‌ వరకు ఛేజింగ్‌ చేసి బంతిని బౌండరీ వెళ్లకుండా ఆపగలిగాడు. అయితే ఈ లోపు ఆండీ మెక్‌బ్రైన్‌, లోర్కాన్‌ టక్కర్‌ ఐదు పరుగులు తీశారు. క్రికెట్‌లో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి.

కాగా, ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై ఐర్లాండ్‌ సంచలన విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్య ఛేదనలో 21 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్‌.. లొర్కాన్‌ టక్కర్‌ (56), ఆండీ మెక్‌బ్రైన్‌ (55 నాటౌట్‌) వీరోచితంగా పోరాడటంతో చారిత్రక విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 33/5 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఐర్లాండ్‌.. టక్కర్‌ వికెట్‌ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మెక్‌బ్రైన్‌.. మార్క్‌ అదైర్‌ (24)  సహకారంతో ఐర్లాండ్‌ను గెలిపించాడు. టెస్ట్‌ల్లో ఐర్లాండ్‌కు ఇది రెండో విజయం. ఈ ఏడాదే ఐర్లాండ్‌ తమకంటే మెరుగైన ఆఫ్ఘనిస్తాన్‌కు షాకిచ్చింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 210, రెండో ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 250, సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.

 

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)