Breaking News

ఐర్లాండ్‌ను చిత్తు చేసిన విండీస్‌.. సిరీస్ సమం​

Published on Mon, 05/26/2025 - 13:38

డ‌బ్లిన్ వేదిక‌గా ఐర్లాండ్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో 197 ప‌రుగుల తేడాతో(డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తి) వెస్టిండీస్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్ 1-1తో స‌మమైంది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 385 ప‌రుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.

విండీస్ ఇన్నింగ్స్‌లో ఫ‌స్ట్ డౌన్ బ్యాట‌ర్ కీస్ కార్టీ అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. ఈ మ్యాచ్‌లో 142 బంతులు ఎదుర్కొన్న కార్టీ.. 15 ఫోర్లు, 8 సిక్స్‌ల‌తో 170 ప‌రుగులు చేశాడు. ఈ సిరీస్‌లో కార్టీకి ఇది వ‌రుస‌గా రెండో సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం. 

విండీస్ బ్యాట‌ర్ల‌లో కార్టీతో పాటు కెప్టెన్ షాయ్ హోప్‌(75), జ‌స్టిన్ గ్రీవ్స్‌(50) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. ఐరీష్ బౌల‌ర్ల‌లో బారీ మెక్‌కార్తీ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. లైమ్ మెక్‌కార్తీ రెండు, మెక్‌బ్రైన్‌, డ‌కెర‌ల్ త‌లా వికెట్ సాధించారు.

అనంత‌రం వ‌ర్షం కార‌ణంగా 46 ఓవ‌ర్ల‌లో ఐర్లాండ్ టార్గెట్‌ను 363గా నిర్ణ‌యించారు. భారీ ల‌క్ష్య చేధ‌న‌లో ఐర్లాండ్ 29.5 ఓవ‌ర్లలో 165 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఐర్లాండ్ బ్యాట‌ర్ల‌లో కేడ్ కార్మైకేల్(48) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు.

విండీస్ బౌల‌ర్ల‌లో జైడ‌న్ సీల్స్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టి ఐర్లాండ్‌ను దెబ్బతీయ‌గా.. జోష‌ఫ్‌, గ్రీవ్స్‌, ఛేజ్ త‌లా వికెట్ సాధించారు. కాగా తొలి వ‌న్డేలో ఐర్లాండ్ విజ‌యం సాధించ‌గా.. రెండో వ‌న్డే వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయింది. ఇప్పుడో మూడో వ‌న్డేలో విండీస్ గెల‌వ‌డంతో సిరీస్ స‌మ‌మైంది. ఇక ఇరు జ‌ట్ల మ‌ధ్య టీ20 సిరీస్ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: #CSK: 18 ఏళ్ల ఐపీఎల్ చ‌రిత్ర‌లో తొలిసారి

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)