Breaking News

యశస్వి జైస్వాల్‌ చారిత్రక ఇన్నింగ్స్‌లు.. ఓటమి దిశగా మధ్యప్రదేశ్‌

Published on Sat, 03/04/2023 - 18:52

ఇరానీ ట్రోఫీ 2022-23లో భాగంగా రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా మధ్యప్రదేశ్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ వన్‌సైడెడ్‌గా సాగుతోంది. 437 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసి ఓటమి దిశగా సాగుతోంది. అర్హమ్‌ అఖిల్‌ డకౌట్‌ కాగా.. శుభమ్‌ శర్మ 13 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్‌ హిమాన్షు మంత్రి (51) అజేయ అర్ధశతకంతో మధ్యప్రదేశ్‌ను ఓటమి బారి నుంచి తప్పించేందుకు విఫలయత్నం చేస్తున్నాడు. హిమాన్షుతో పాటు హర్ష్‌ గవ్లీ (15) క్రీజ్‌లో ఉన్నాడు. ముకేశ్‌ కుమార్‌, సౌరభ్‌ కుమార్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు, యశస్వి జైస్వాల్‌ (144) మెరుపు అర్ధసెంచరీతో విజృంభించడంతో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌట్‌ కాగా.. పుల్కిత్‌ నారంగ్‌ (4/65), నవ్‌దీప్‌ సైనీ (3/56), ముకేశ్‌ కుమార్‌ (2/44), సౌరభ్‌ కుమార్‌ (1/74) ధాటికి మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులకే చాపచుట్టేసింది. యశ్‌ దూబే (109) సెంచరీతో రాణించగా.. హర్ష​ గవ్లీ (54), సరాన్ష్‌ జైన్‌ (66) అర్ధసెంచరీలతో పర్వాలేదనిపించారు.

దీనికి ముందు తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి (259 బంతుల్లో 213; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్‌ సెంచరీతో, అభిమన్యు ఈశ్వరన్‌ (154) భారీ సెంచరీతో చెలరేగడంతో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 484 పరుగుల భారీ స్కోర్‌ చేసి ఆలౌటైంది. మధ్యప్రదేశ్‌ బౌలర్లలో ఆవేశ్‌ ఖాన్‌ 4 వికెట్లు పడగొట్టగా.. అనుభవ్‌ అగర్వాల్‌, కుమార్‌ కార్తీకేయ తలో 2 వికెట్లు, అంకిత్‌ కుష్వా ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 190 పరుగుల ఆధిక్యం, రెండో ఇన్నింగ్స్‌లో 246 పరుగుల స్కోర్‌తో కలుపుకుని మధ్యప్రదేశ్‌కు 437 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించింది రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా. ఈ మ్యాచ్‌తో ఇరానీ కప్‌ అరంగేట్రం చేసిన యశస్వి.. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)