Breaking News

విజయానికి 331 పరుగుల దూరంలో..

Published on Sun, 10/05/2025 - 08:41

రంజీ ట్రోఫీ విజేత విదర్భ, రెస్టాఫ్‌ ఇండియా (Vidarbha vs Rest of India) మధ్య నాగ్‌పూర్‌ వేదికగా జరుగుతున్న ఇరానీ కప్‌ (Irani Cup 2025) రసవత్తరంగా సాగుతోంది. 361 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన రెస్టాఫ్‌ ఇండియా... శనివారం ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. 

అభిమన్యు ఈశ్వరన్‌ (17), ఆర్యాన్‌ జుయల్‌ (6) అవుట్‌ కాగా... ఇషాన్‌ కిషన్‌ (18 బంతుల్లో 5 బ్యాటింగ్‌), కెప్టెన్‌ రజత్‌ పాటీదార్‌ ( Rajat Patidar- 22 బంతుల్లో 2 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. 

విజయానికి 331 పరుగుల దూరంలో..
చేతిలో 8 వికెట్లు ఉన్న రెస్టాఫ్‌ ఇండియా... విజయానికి ఇంకా 331 పరుగులు చేయాల్సి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయలేకపోయిన రెస్టాఫ్‌ ఇండియా బ్యాటర్లు... మరి చివరి రోజు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారో చూడాలి.

కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్, యశ్‌ ధుల్, మానవ్‌ సుతార్‌ ఇంకా బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. విదర్భ బౌలర్లలో హర్శ్‌ దూబే, ఆదిత్య ఠాకరే చెరో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 96/2తో శనివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన విదర్భ జట్టు... చివరకు 94.1 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. 

దీంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 128 పరుగులతో కలుపుకొని ప్రత్యర్థి ముందు 361 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినట్లు అయింది. అమన్‌ (37), కెప్టెన్‌ అక్షయ్‌ వాడ్కర్‌ (125 బంతుల్లో 36; 4 ఫోర్లు), దర్శన్‌ నల్కండే (92 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్‌) తలా కొన్ని పరుగులు చేశారు. 

అన్షుల్‌ కంబోజ్‌కు 4 వికెట్లు
తొలి ఇన్నింగ్స్‌లో మంచి పోరాటం కనబర్చిన విదర్భ ఆటగాళ్లు... రెండో ఇన్నింగ్స్‌లో అదే జోరు కొనసాగించలేకపోయారు. మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోవడంతో విదర్భ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.

ఇక హర్శ్‌ దూబే (43 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడేందుకు ప్రయత్నించాడు. రెస్టాప్‌ ఇండియా బౌలర్లలో అన్షుల్‌ కంబోజ్‌ 4 వికెట్లు పడగొట్టాడు.నేడు (అక్టోబరు 5) ఆటకు చివరి రోజు.

స్కోరు వివరాలు 
విదర్భ తొలి ఇన్నింగ్స్‌: 342
రెస్టాఫ్‌ ఇండియా తొలి ఇన్నింగ్స్‌: 214

విదర్భ రెండో ఇన్నింగ్స్‌: అథర్వ తైడె (సి) ఆకాశ్‌దీప్‌ (బి) మానవ్‌ సుతార్‌ 15; అమన్‌ మోఖడే (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) గుర్‌నూర్‌ బ్రార్‌ 37; ధ్రువ్‌ షొరే (ఎల్బీ) (బి) అన్షుల్‌ కంబోజ్‌ 27; దానిశ్‌ మాలేవార్‌ (సి) రుతురాజ్‌ (బి)అన్షుల్‌ కంబోజ్‌ 16; యశ్‌ రాథోడ్‌ (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) అన్షుల్‌ కంబోజ్‌ 5; అక్షయ్‌ వాడ్కర్‌ (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) అన్షుల్‌ కంబోజ్‌ 36; హర్శ్‌ దూబే (సి) సారాంశ్‌ (బి) గుర్‌నూర్‌ బ్రార్‌ 29; పార్థ్‌ రేఖడే (సి) రజత్‌ పాటీదార్‌ (బి) సారాంశ్‌ 2; యశ్‌ ఠాకూర్‌ (సి) ఆర్యాన్‌ జుయల్‌ (బి) మానవ్‌ సుతార్‌ 13; ఆదిత్య ఠాకరే (నాటౌట్‌) 3; 
ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం (94.1 ఓవర్లలో ఆలౌట్‌) 232.

వికెట్ల పతనం: 1–42, 2–64, 3–97, 4–104, 5–105, 6–144, 7–155, 8–190, 9–207, 10–232. బౌలింగ్‌: సారాంశ్‌ జైన్‌ 21.1–0–52–2; ఆకాశ్‌దీప్‌ 10–4–13–0; మానవ్‌ సుతార్‌ 33–9–82–2; అన్షుల్‌ కంబోజ్‌ 12–1–34–4; గుర్‌నూర్‌ బ్రార్‌ 18–5–41–2.

రెస్టాఫ్‌ ఇండియా రెండో ఇన్నింగ్స్‌: అభిమన్యు ఈశ్వరన్‌ (ఎల్బీ) (బి) హర్శ్‌ దూబే 17; ఆర్యాన్‌ జుయల్‌ (బి) ఆదిత్య 6; ఇషాన్‌ కిషన్‌ (బ్యాటింగ్‌) 5; రజత్‌ పాటీదార్‌ (బ్యాటింగ్‌) 2; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (12 ఓవర్లలో 2 వికెట్లకు) 30. వికెట్ల పతనం: 1–16, 2–24; బౌలింగ్‌: హర్శ్‌ దూబే 6–2–20–1; ఆదిత్య ఠాకరే 5–1–8–1; పార్థ్‌ రేఖడే 1–0–2–0.  

చదవండి: అందుకే రోహిత్‌ శర్మపై వేటు.. అప్పటి వరకు రో-కో ఆడటం కష్టమే: అగార్కర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)