Breaking News

అరంగేట్రంలోనే అదరగొట్టిన యశస్వి జైస్వాల్‌.. డబుల్‌ సెంచరీతో..!

Published on Wed, 03/01/2023 - 17:19

Irani Cup 2022-23: ముంబై యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌..ఇరానీ ట్రోఫీ అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఈ టోర్నీలో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా తరఫున బరిలోకి దిగిన యశస్వి.. మధ్యప్రదేశ్‌తో ఇవాళ (మార్చి 1) ప్రారంభమైన మ్యాచ్‌లో 230 బంతుల్లో డబుల్‌ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా ఇరానీ ట్రోఫీలో ఈ ఘనత సాధించిన 10వ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 259 బంతులు ఎదుర్కొన్న యశస్వి.. 30 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 213 పరుగులు చేపి ఔటయ్యాడు. యశస్వికి బెంగాల్‌ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్‌ (154) తోడయ్యాడు. వీరిద్దరూ శతకాలతో విజృంభించడంతో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది.

కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ 2 పరుగులు మాత్రమే చేసి ఔట్‌ కాగా.. యశస్వి, ఈశ్వరన్‌ శతకాల మోత మోగించారు. సౌరభ్‌ కుమార్‌ (0), బాబా ఇంద్రజిత్‌ (3) క్రీజ్‌లో ఉన్నారు. మధ్యప్రదేశ్‌ బౌలర్లలో ఆవేశ్‌ ఖాన్‌ 2 వికెట్లు పడగొట్టగా.. ఈశ్వరన్‌ రనౌటయ్యాడు.

కాగా, యశస్వి జైస్వాల్‌కు అరంగేట్రం మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ బాదడం కొత్తేమి కాదు. దులీప్‌ ట్రోఫీ డబ్యూలోనూ యశస్వి ఇదే తరహాలో డబుల్‌ సెంచరీతో విజృంభించాడు. ఈ ట్రోఫీలో వెస్ట్‌ జోన్‌కు ప్రాతినిధ్యం వహించిన యశస్వి.. నార్త్‌ ఈస్ట్‌ జోన్‌పై 227 పరుగులు చేశాడు. అలాగే ఇండియా-ఏ తరఫున అరంగేట్రం మ్యాచ్‌లోనూ యశస్వి సెంచరీతో చెలరేగాడు. 2022 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 146 పరుగులు స్కోర్‌ చేశాడు.  


 

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు