అందుకే స‌న్‌రైజ‌ర్స్‌ వ‌దిలేసింది.. అక్క‌డ కూడా అదే ఆట‌నా?

Published on Fri, 03/28/2025 - 23:10

ఐపీఎల్‌-2025లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆట‌గాడు రాహుల్ త్రిపాఠి వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ విఫ‌ల‌మయ్యాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చెపాక్ వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో మ్యాచ్‌లో త్రిపాఠి దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. మ‌రోసారి ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగిన త్రిపాఠి కేవ‌లం 5 ప‌రుగులు మాత్ర‌మే చేసి పెవిలియ‌న్‌కు చేరాడు. 

జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్‌లో చెత్త షాట్‌కు ప్ర‌యత్నించి త‌న వికెట్‌ను కోల్పోయాడు. అంత‌కుముందు ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కూడా త్రిపాఠి కేవ‌లం 2 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఈ క్ర‌మంలో త్రిపాఠిని సీఎస్‌కే  ఫ్యాన్స్ దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ చెత్త ఆడినందుకే స‌న్‌రైజ‌ర్స్ వ‌దిలేసింది అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

కాగా రాహుల్ త్రిపాఠి గ‌త కొన్ని సీజ‌న్ల‌గా ఎస్ఆర్‌హెచ్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. కానీ ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్ మెగా వేలానికి ముందు ఎస్ఆర్‌హెచ్ విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వ‌చ్చిన అత‌డిని సీఎస్‌కే రూ. 3.40 కోట్లకు కొనుగోలు చేసింది. త‌న ధ‌ర‌కు త‌గ్గ న్యాయం త్రిపాఠి చేయ‌లేక‌పోతున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 196 ప‌రుగులు చేసింది.
చ‌ద‌వండి: #MS Dhoni: వారెవ్వా ధోని..కళ్లు మూసి తెరిచేలోపే! వీడియో వైర‌ల్‌
 

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)