Breaking News

IPL: ఐపీఎల్‌ కాదు.. అంతకు మించి! వారికి మాత్రం నో చెప్పలేమన్న బీసీసీఐ!

Published on Sun, 04/16/2023 - 14:12

ప్రపంచంలోని టీ20 లీగ్‌లన్నింటిలో ఐపీఎల్‌ది ప్రత్యేక స్థానం. క్యాష్‌ రిచ్‌ లీగ్‌గా పేరొందిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు ఇతర లీగ్‌లు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్నాయి. ఆటగాళ్లపై కనక వర్షం కురిపిస్తూ.. అభిమానులకు అంతులేని వినోదాన్ని అందిస్తూ గత పదిహేనేళ్లుగా విజయవంతంగా కొనసాగుతోందీ ఐపీఎల్‌.

ఎక్కడా లేని క్రేజ్‌
పదహారవ ఎడిషన్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ వంటి సరికొత్త నిబంధనలు ప్రవేశపెట్టి ముందుకు సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి జట్ల ఆటగాళ్ల స్టార్‌డమ్‌ పెంచడం సహా.. అసోసియేట్‌ దేశాల క్రికెటర్లకు కూడా కావాల్సినంత గుర్తింపు దక్కేలా చేస్తోంది.

క్రికెట్‌ను కేవలం ఆటలా కాకుండా మతంలా భావించే కోట్లాది మంది అభిమానులున్న భారత్‌లో ఐపీఎల్‌కు దక్కుతున్న ఆదరణ మరే ఇతర దేశాల లీగ్‌లకు కూడా లేదు. అలాంటిది సౌదీ అరేబియా.. ఐపీఎల్‌ను మించేలా ధనిక లీగ్‌ రూపొందించేందుకు ప్రణాళికలు రచిస్తామంటూ చేసిన ప్రకటన చేసిందన్న వార్త క్రీడా వర్గాలను ఆశ్చర్యపరిచింది.

సౌదీ సంచలనం?
ఫార్ములా వన్‌ రేసులతో పాటు క్రిస్టియానో రొనాల్డో వంటి పాపులర్‌ స్టార్లను తమ ఫుట్‌బాల్‌ లీగ్‌లలో ఆడిస్తూ వార్తల్లో నిలుస్తున్న సౌదీ.. క్రికెట్‌పై కూడా దృష్టి సారించినట్లు ఆ వార్తా కథనాల సారాంశం. ఐపీఎల్‌ బ్రాండ్‌ వాల్యూని మించిన లీగ్‌తో సంచలనం సృష్టించాలని సౌదీ భావిస్తున్నట్లు వార్తలు వినిపించాయి.

అవును.. వాళ్లకు ఆసక్తి ఉందన్న ఐసీసీ
ఈ విషయంపై స్పందించిన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి చైర్మన్‌ గ్రెగ్‌ బార్‌క్లే.. ‘‘అవును.. సౌదీ క్రికెట్‌పై ఆసక్తి కనబరుస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. క్రికెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ ఆసక్తిగా ఉందని తెలిపారు. 

ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలను సంప్రదించి.. తమతో కలిసి టీ20 లీగ్‌లో భాగం కావాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలితో కూడా చర్చలు జరపాలని నిర్ణయించుకున్నట్లు కథనాలు వచ్చాయి. 

వారికి మాత్రం నో చెప్పలేము
ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం భారత క్రికెటర్లెవరూ ఇతర దేశాల లీగ్‌లలో ఆడటం లేదు. అయితే, ఫ్రాంఛైజీలు సదరు లీగ్‌లో పాల్గొనాలా లేదా అన్నది ఓనర్ల ఇష్టం. ఫ్రాంఛైజీ ఓనర్లను అయితే మేము ఆపలేం కదా! అది వారు సొంతంగా తీసుకోవాల్సిన నిర్ణయం. ​

ఇప్పటికే ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు సౌతాఫ్రికా, దుబాయ్‌ లీగ్‌లలో భాగమయ్యాయి. వారికి మేము నో చెప్పలేదు. ప్రపంచంలోని ఏ లీగ్‌లోనైనా పాల్గొనే స్వేచ్ఛ వారికి ఉంది’’ అని పేర్కొన్నారు. కాగా భారత క్రికెటర్లను విదేశీ టీ20 లీగ్‌లు ఆడేందుకు బీసీసీఐ అనుమతించడం లేదన్న విషయం తెలిసిందే.

అంతసీన్‌ లేదు!
ఒకవేళ ఆటగాళ్లెవరైనా పాల్గొనాలని భావిస్తే మాత్రం బోర్డుతో సంబంధాలన్ని పూర్తిగా తెగదెంపులు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు.. ఫ్రాంఛైజీలు మాత్రం సౌతాఫ్రికా, దుబాయ్‌ లీగ్‌లలో పెట్టుబడులు పెట్టినప్పటికీ ఐపీఎల్‌కు క్రేజ్‌ ముందు ఈ లీగ్‌లు పూర్తిగా తేలిపోతున్నాయి. నిజానికి టీమిండియా క్రికెటర్లు లేకుండా సౌదీ టీ20 లీగ్‌ ప్రవేశపెట్టినా ఆదరణ విషయంలో ఐపీఎల్‌ దరిదాపుల్లోకి కూడా వచ్చే అవకాశం ఉండదు.

చదవండి: ఇదేమైనా టీమిండియానా? గెలిస్తే క్రెడిట్‌ తీసుకుని.. ఓడితే వేరే వాళ్లను నిందిస్తూ..
గంగూలీ స్థాయి పెరిగింది.. కోహ్లి అలా... రవిశాస్త్రి ఇలా! అధికారం ఉండదంటూ..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)