Breaking News

‘హండ్రెడ్‌’లో ఐపీఎల్‌ ఫ్రాంచైజీల హవా

Published on Thu, 07/31/2025 - 07:54

లండన్‌: ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) నిర్వహిస్తున్న ‘హండ్రెడ్‌’ లీగ్‌లోని ఎనిమిది జట్లలో వాటాల అమ్మకం దాదాపుగా పూర్తయింది. ఆరు జట్లకు సంబంధించి ఒప్పందాలు అధికారికంగా ఖాయం అయ్యాయని, మరో రెండు జట్ల విషయంలో చర్చలు తుది దశలో ఉన్నాయని ఈసీబీ ప్రకటించింది.

ఈ రెండు జట్లకు సంబంధించి కూడా కొన్ని చిన్న సాంకేతిక అంశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని, త్వరలోనే ఇది కూడా పూర్తవుతుందని బోర్డు వెల్లడించింది. ఈ ఎనిమిది టీమ్‌లలో నాలుగు టీమ్‌లను ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో జట్లు ఉన్న యాజమాన్యాలే సొంతం చేసుకోవడం విశేషం. 

టి20 క్రికెట్‌ నుంచి స్వల్ప మార్పులతో 100 బంతులు ఆడే విధంగా 2021లో ప్రారంభమైన ‘హండ్రెడ్‌’ లీగ్‌ క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకుంటూ నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు నేరుగా ఈసీబీ ఈ టోర్నీఎనిమిది జట్ల నిర్వహణను పర్యవేక్షిస్తుండగా...ఒప్పందాలు పూర్తయిన తర్వాత అక్టోబర్‌ 1 నుంచి ఆయా ఫ్రాంచైజీ యజమాన్యాలు నడిపించుకునే విధంగా హక్కులు అందిస్తారు.

అయితే అంతకు ముందే ఆగస్టు 5 నుంచి 31 వరకు జరిగే 2025 సీజన్‌ను కూడా ఈసీబీనే నిర్వహిస్తుంది. ‘హండ్రెడ్‌’లో ఉన్న జట్లలో నార్తర్న్‌ సూపర్‌ చార్జర్స్‌ను 100 శాతం వాటాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం సన్‌ గ్రూప్‌ సొంతం చేసుకోగా, లక్నో సూపర్‌ జెయింట్స్‌ టీమ్‌ యజమాని సంజీవ్‌ గోయెంకా 70 శాతం వాటాతో మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ను దక్కించుకున్నారు.

సదరన్‌ బ్రేవ్‌ టీమ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం జీఎంఆర్‌ గ్రూప్‌ 49 శాతం వాటాతో తీసుకోగా...ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ గ్రూప్‌ కూడా 49 శాతం వాటాతో ఓవల్‌ ఇన్‌విన్సిబుల్స్‌లో భాగస్వామిగా మారింది. అయితే ఇంకా రిలయన్స్‌–ఓవల్‌ ఒప్పందం అధికారికంగా ఖాయం కాలేదు.

ఇదే తరహాలో ట్రెంట్‌ రాకెట్స్‌ జట్టుకు సంబంధించి కెయిన్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ ఒప్పందం కూడా ఇంకా పూర్తి కాలేదు. మరో వైపు బర్మింగ్‌హామ్‌ ఫోనిక్స్‌ టీమ్‌కు నైట్‌హెడ్‌ క్యాపిటల్‌ సంస్థ, లండన్‌ స్పిరిట్‌ టీమ్‌లో క్రికెట్‌ ఇన్వెస్టర్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్, వెల్ష్‌ ఫైర్‌ టీమ్‌లో సంజయ్‌ గోవిల్‌ ప్రధాన వాటాదారులుగా ఉన్నారు. ‘హండ్రెడ్‌’లో ఎనిమిది జట్ల కోసం బయటి వ్యక్తులను భాగస్వాములుగా చేసుకోవడంలో ఈసీబీలో 500 మిలియన్‌ పౌండ్‌లు (సుమారు రూ.5,800 కోట్లు) పెట్టుబడుల రూపంలో వచ్చాయి.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)