CSK Vs GT: సీఎస్‌కే ఆల్‌రౌండ్ షో.. కీల‌క మ్యాచ్‌లో గుజ‌రాత్ చిత్తు

Published on Sun, 05/25/2025 - 19:39

ఐపీఎల్‌-2025 సీజ‌న్‌ను చెన్నై సూప‌ర్ కింగ్స్ అద్బుత‌మైన విజ‌యంతో ముగించింది. అహ్మదాబాద్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 83 ప‌రుగుల తేడాతో సీఎస్‌కే చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై జ‌ట్టు ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టింది. 

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 230 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్‌(23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 57), డెవాన్ కాన్వే(35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) సూప‌ర్‌ హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగ‌గా.. ఆయూష్ మాత్రే(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 34), ఉర్విల్ ప‌టేల్‌(19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 37) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ప్ర‌సిద్ద్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టగా.. సాయికిషోర్‌, రషీద్ ఖాన్‌, షారుఖ్ ఖాన్ తలా వికెట్ సాధించారు.

సుద‌ర్శ‌న్ ఒక్క‌డే..
అనంత‌రం ల‌క్ష్య చేధ‌న‌లో సీఎస్‌కే బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో గుజ‌రాత్‌.. 18.3 ఓవ‌ర్ల‌లో 147 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ సాయిసుద‌ర్శ‌న్‌(41) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. 

కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ 13 ప‌రుగులు చేయ‌గా.. స్టార్ బ్యాట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ కేవ‌లం 5 ప‌రుగులు మాత్ర‌మే చేసి నిరాశ‌ప‌రిచారు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో అన్షుల్ కాంబోజ్‌, నూర్ అహ్మ‌ద్ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్టి గుజ‌రాత్‌ను దెబ్బ‌తీయ‌గా.. ర‌వీంద్ర జ‌డేజా రెండు, ప‌తిరానా, ఖాలీల్ అహ్మ‌ద్  చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

కాగా ఈ ఓట‌మితో గుజ‌రాత్ టైటాన్స్ టాప్-2 స్దానం ప్రమాదంలో ప‌డింది. ఆర్సీబీ, పంజాబ్ త‌మ త‌దుప‌రి రెండు మ్యాచ్‌ల‌లో గెలిస్తే గుజ‌రాత్ మూడో స్ధానానికి ప‌డిపోతుంది.
చదవండి: IPL 2025: ప్లే ఆఫ్స్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)