Breaking News

ఐపీఎల్‌ 2026పై బిగ్‌ అప్‌డేట్‌

Published on Tue, 03/10/2026 - 15:22

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 ఎడిషన్‌పై బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. మార్చి 12న లీగ్‌ తొలి 20 రోజుల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారికంగా ప్రకటించారు.

దేశంలో పలు రాష్ట్రాల్లో (పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం) ఎన్నికల నేపథ్యంలో పూర్తి షెడ్యూల్ ప్రకటించడంలో ఆలస్యం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మిగతా షెడ్యూల్‌ను ప్రకటిస్తామని వెల్లడించారు.  

కాగా, ఐపీఎల్‌ 2026 ఎడిషన్‌ తొలుత మార్చి 26న ప్రారంభమవుతుందని ప్రకటించినా, కొన్ని కారణాల వల్ల రెండు రోజులు వాయిదా పడింది. ఈ ఎడిషన్‌ మార్చి 28న ప్రారంభమై, మే 31న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది.

ఓపెనింగ్ మ్యాచ్‌లో ఎవరెవరు..? 
సాంప్రదాయం ప్రకారం గత సీజన్ విజేతలు, రన్నరప్ జట్లు సీజన్‌ తొలి మ్యాచ్ ఆడతాయి. ఈ లెక్కన ఆర్సీబీ (విజేతలు), పంజాబ్‌ కింగ్స్‌ (రన్నరప్) మధ్య తొలి మ్యాచ్‌ జరిగే అవకాశం ఉంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఓపెనింగ్ మ్యాచ్ జరుగుతుందని ఇప్పటికే ప్రకటించారు.  

అయితే ఇటీవల స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన పోస్టర్‌లో ఐపీఎల్‌ ట్రోఫీ చుట్టూ పసుపు, గులాబీ రంగు రిబ్బన్లు ఉండటంతో సీఎస్‌కే, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య తొలి మ్యాచ్ జరుగుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే విజేతలు, రన్నరప్‌ అనే సాంప్రదాయానికి బ్రేక్‌ పడినట్లే. దీనిపై స్పష్టత రావాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే. 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)