Breaking News

ఐపీఎల్‌ 2026కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌

Published on Fri, 10/10/2025 - 12:54

ఐపీఎల్‌ 2026కు (IPL 2026) సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌ తెలుస్తుంది. ఈ సీజన్‌ వేలం డిసెంబర్ 13–15 మధ్య తేదీల్లో జరగనుందని సమాచారం. బీసీసీఐతో చర్చించిన ఫ్రాంచైజీల ప్రతినిధులు ఈ తేదీలను సూచించారని తెలుస్తుంది. ఈ విషయంపై ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌దే తుది నిర్ణయంగా ఉంటుంది.

రిటెన్షన్‌కు ఇదే డెడ్‌లైన్‌..!
అన్ని ఫ్రాంచైజీలు నవంబర్ 15లోగా తమ రిటెన్షన్‌ జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. విడుదల చేయబోయే ఆటగాళ్ల పేర్లను అంతకుముందే ఖరారు చేయాలి.

ఈసారి వేలం భారత్‌లోనే..?
గత రెండు సీజన్లలో (2023 దుబాయ్‌, 2024 జెడ్డా) విదేశాల్లో జరిగిన వేలం, ఈసారి భారత్‌లోనే జరిగే అవకాశముంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

సీఎస్‌కే, రాజస్థాన్‌ రాయల్స్‌లో భారీ మార్పులు..?
చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK), రాజస్తాన్‌ రాయల్స్‌ (RR) గత సీజన్‌లో అట్టడుగు స్థానాల్లో ముగించడంతో వచ్చే సీజన్‌కు ముందు భారీ మార్పులకు ఆస్కారముంటుంది.

సీఎస్‌కే.. దీపక్‌ హుడా, విజయ్‌ శంకర్, రాహుల్‌ త్రిపాఠి లాంటి లోకల్‌ వెటరన్లను వదిలించుకోవచ్చు. అశ్విన్‌ ఎలాగూ ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు కాబట్టి, అతనికి ఇస్తున్న రూ. 9.75 కోట్లను కూడా వేలంలో వాడుకోవచ్చు.

రాజస్తాన్‌ విషయానికొస్తే.. వేలానికి ముందే ఆ జట్టు యాజమాన్యం కెప్టెన్‌ సంజూ శాంసన్‌ను ట్రేడింగ్‌ విండో ఆప్షన్‌ ద్వారా విడుదల చేసే అవకాశముంది. ఇతర ఫ్రాంచైజీలు ఏవైనా సంజూపై ఆసక్తి కనబరిస్తే.. ట్రేడింగ్‌ జరగవచ్చు.

ఆర్‌ఆర్‌ యాజమాన్యం సంజూతో పాటు వనిందు హసరంగ, మహీష్‌ తీక్షణను కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. వీరి విషయంలో కుమార సంగక్కర (కోచ్‌) కీలకపాత్ర పోషిస్తాడు.

వెంకటేష్‌ అయ్యర్‌పై వేటు
గత సీజన్‌ వేలంలో ఎవరూ ఊహించని రీతిలో రూ. 23.75 కోట్ల ధర దక్కించుకున్న వెంకటేశ్‌ అయ్యర్‌ను కేకేఆర్‌ వదిలించుకోవచ్చు. గత సీజన్‌లో అతను దారుణంగా విఫలమయ్యాడు.

గ్రీన్‌కు భారీ ధర..?
ఈ సీజన్‌ వేలంలో ఆసీస్‌ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కెమారూన్‌ గ్రీన్‌కు భారీ ధర దక్కే అవకాశం ఉంది. గత సీజన్‌లో‌ గాయంతో మిస్‌ అయిన గ్రీన్‌ కోసం ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం ఉంది. 

చదవండి: విండీస్‌తో రెండో టెస్ట్‌.. చరిత్ర సృష్టించిన బుమ్రా

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)