IPL 2025: వైభవ్‌ ఒక్క మ్యాచ్‌లో చేస్తే, సీఎస్‌కేకు సీజన్‌ మొత్తం పట్టింది..!

Published on Thu, 05/01/2025 - 18:11

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (మే 1) రాత్రి అత్యంత కీలకమైన మ్యాచ్‌ జరుగనుంది. వరుస విజయాలతో (5) దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ సొంత మైదానంలో ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు కీలకంగా పరిగణించబడుతుంది. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ తప్పనిసరిగా గెలవాలి. ఈ మ్యాచ్‌లో ఓడితే రాయల్స్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే. 

మరోవైపు ముంబై ఇండియన్స్‌కు కూడా ఈ మ్యాచ్‌ కీలకమే. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌పై ఖర్చీఫ్‌ వేసుకోవాలని ముంబై ఇండియన్స్‌ భావిస్తుంది. ప్రస్తుతం ముంబై 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రాయల్స్‌ 10 మ్యాచ్‌ల్లో మూడే విజయాలతో చివరి నుం‍చి మూడో స్థానంలో ఉంది.

కాగా, ఈ మ్యాచ్‌కు ముందు క్రికెట్‌ ప్రపంచం దృష్టి మొత్తం 14 ఏళ్ల రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీపైనే ఉంది. గత మ్యాచ్‌లో వైభవ్‌ గుజరాత్‌పై 35 బంతుల్లో శతక్కొట్టి ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయాడు. ఈ విధ్వంసకర ప్రదర్శన కారణంగా నేటి మ్యాచ్‌లో వైభవ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. వైభవ్‌.. ప్రపంచంలోనే అరివీర భయంకరులైన బుమ్రా, బౌల్ట్‌ను ఎలా ఎదుర్కోగలడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కు ముందు ఓ ఆసక్తికర అంశం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సీజన్‌లో చెత్త ప్రదర్శనతో అందరి కంటే ముందే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన సీఎస్‌కేను వైభవ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పోటీ పెడుతున్నారు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్‌ పవర్‌ ప్లేలో (తొలి 6 ఓవర్లలో) ఆరు సిక్సర్లు బాదగా.. సీఎస్‌కే ఈ సీజన్‌ మొత్తంలో పవర్‌ ప్లేల్లో ఆరే సిక్సర్లు కొట్టింది.

ఈ లెక్క చూస్తే ప్రస్తుత సీజన్‌లో సీఎస్‌కే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్దమవుతుంది. ఆ జట్టు టాపార్డర్‌ ఆటగాళ్లు టెస్ట్‌ మ్యాచ్‌ల కంటే నిదానంగా ఆడుతున్నారు. పోనీ వికెట్లైనా కాపాడుకున్నారా అంటే అదీ లేదు. ఈ సీజన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం రెండు సార్లు మాత్రమే 50కి మించి ఓపెనింగ్‌ పార్ట్‌నర్‌షిప్‌లు నమోదు చేసింది.

తొలి మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ చేసి జోష్‌లో ఉన్నట్లు కనిపించిన రచిన్‌ రవీంద్ర ఆ తర్వాత తేలిపోయాడు. దారుణమైన విషయమేమిటంటే, ఇతర ఆటగళ్లతో పోలిస్తే రచిన్‌ రవీంద్రనే కాస్త బెటర్‌. రచిన్‌ రెండు మూడు మ్యాచ్‌లకు ఒకసారైనా 20, 30 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లు అదీ చేయలేక చేతులెత్తేశారు. నిన్న మొన్న వచ్చిన ఆయుశ్‌ మాత్రే కాస్త పర్వాలేదనిపిస్తున్నాడు. నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సామ్‌ కర్రన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. ఈ సీజన్‌లో సీఎస్‌కే బ్యాటర్ల నుంచి ఇది తప్ప మంచి స్కోరే లేదు. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)