Breaking News

ఐపీఎల్‌ 2025 జట్టు ప్రకటన.. కెప్టెన్‌ ఎవరంటే..?

Published on Fri, 06/06/2025 - 17:58

ఐపీఎల్‌ 2025 సీజన్‌ జూన్‌ 3న జరిగిన ఫైనల్‌తో ముగిసింది. ఫైనల్లో ఆర్సీబీ పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది. ఐపీఎల్‌లో ఆర్సీబీకి ఇది తొలి టైటిల్‌. 18 ఏళ్ల ప్రస్తానంలో ఆ జట్టు మూడు సార్లు ఫైనల్‌కు చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. నాలుగో ప్రయత్నంలో ఆ జట్టు టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. 

పంజాబ్‌ విషయానికొస్తే.. ఈ జట్టు 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరింది. రెండో ప్రయత్నంలోనూ ఆ జట్టుకు నిరాశే మిగిలింది. సీజన్‌ ఆధ్యాంతం అద్భుతంగా రాణించినా పంజాబ్‌ తుది మెట్టుపై బోల్తా పడింది. కొత్త కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఆ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. 

ఫైనల్లో ఓడినా పంజాబ్‌ మంచి మార్కులే కొట్టేసింది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. శ్రేయస్‌ ఐపీఎల్‌లో మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ఫైనల్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు.

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2025 టీమ్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌ను తాజాగా ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఎంపికయ్యాడు. ఈ జట్టులో ఈ సీజన్‌ స్టార్లందరికీ చోటు దక్కింది. గుజరాత్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ మాత్రం ఈ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 

ఈ జట్టులో అత్యధికంగా నలుగురు ఆర్సీబీ ఆటగాళ్లకు చోటు దక్కింది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కొహ్లి సహా జితేశ్‌ శర్మ, కృనాల్‌ పాండ్యా, జోష్‌ హాజిల్‌వుడ్‌ చోటు దక్కించుకున్నారు. వికెట్‌కీపర్‌గా జితేశ్‌ శర్మ ఎంపికయ్యాడు. ఇంపాక్ట్‌ సబ్‌గా సీఎస్‌కే స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ను ఎంపిక చేశారు.

ఈ జట్టుకు ఓపెనర్లుగా విరాట్‌ కోహ్లి, గుజరాత్‌ ఆటగాడు సాయి సుదర్శన్‌ ఎంపిక కాగా.. వన్‌డౌన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్‌, నాలుగో స్థానంలో ముంబై విధ్వంసకర బ్యాటర్‌ సూర్యకుమార్‌, ఐదో స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌, ఆరో స్థానంలో జితేశ్‌ శర్మ, ఏడో ప్లేస్‌లో శశాంక్‌ సింగ్‌, ఆల్‌రౌండర్ల కోటాలో కృనాల్‌ పాండ్యా, స్పెషలిస్ట్‌ పేసర్లుగా బుమ్రా, హాజిల్‌వుడ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ ఎంపికయ్యారు. 

ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శనలు కనబర్చిన ఆటగాళ్లతో ఈ జట్టు ఎంపిక జరిగింది. పంజాబ్‌ లోయర్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ శశాంక్‌ సింగ్‌కు ఈ జట్టులో అనూహ్యంగా చోటు దక్కింది.  

ఐపీఎల్‌ 2025 టీమ్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌: విరాట్‌ కోహ్లి, సాయి సుదర్శన్‌, నికోలస్‌ పూరన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), జితేశ్‌ శర్మ (వికెట్‌కీపర్‌), శశాంక్‌ సింగ​్‌, కృనాల్‌ పాండ్యా, జస్ప్రీత్‌ బుమ్రా, జోష్‌ హాజిల్‌వుడ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, నూర్‌ అహ్మద్‌ (ఇంపాక్ట్‌ ప్లేయర్‌)
 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)