Breaking News

IPL 2025 Final: శ్రేయస్‌ అయ్యర్‌ను ఎగతాళి చేసిన ఆర్సీబీ ఎక్స్‌ట్రా ప్లేయర్‌..?

Published on Wed, 06/04/2025 - 16:46

17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్సీబీ ఐపీఎల్‌ ఛాంపియన్‌గా అవతరిం‍చింది. నిన్న (జూన్‌ 3) జరిగిన 2025 సీజన్‌ ఫైనల్లో ఆ జట్టు పంజాబ్‌ కింగ్స్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి ఐపీఎల్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 18 సీజన్ల ప్రస్థానంలో నాలుగు సార్లు ఫైనల్‌కు చేరిన ఆర్సీబీ నాలుగో ప్రయత్నంలో చివరి మెట్టును దాటింది. 

ఈ టైటిల్‌ కోసం ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి కూడా 18 సీజన్లు వేచి చూడాల్సి వచ్చింది. 18 ఏళ్లుగా ఆర్సీబీకే ప్రాతినిథ్యం వహిస్తున్న విరాట్‌ ఎట్టకేలకు 18వ ఎడిషన్‌లో టైటిల్‌ కలను సాకారం చేసుకున్నాడు. ప్రతి సీజన్‌కు ముందు ఆర్సీబీ అభిమానులు ఈ సాలా కప్‌ నమదే అంటూ ఎదురుచూసేవారు. ఎట్టకేలకు వారి కల 18వ ప్రయత్నంలో సాకారమైంది.

టైటిల్‌ గెలిచాక ఆర్సీబీ ఆటగాళ్లు ఉద్వేగభరితమైన సంబరాలు చేసుకున్నారు. విజయం ఖరారు కాగానే విరాట్‌ నెలకొరిగి కన్నీరు పెట్టుకోగా.. మిగతా ఆటగాళ్లంతా అతన్ని చుట్టుముట్టారు. ట్రోఫీ సెలబ్రేషన్స్‌ సందర్భంగా కెప్టెన్‌ పాటిదార్‌ విరాట్‌నే ట్రోఫీ లిఫ్ట్‌ చేయాల్సిందిగా కోరాడు. విరాట్‌ చిన్నపిల్లాడిలా మైమరచిపోయి సంబరాలు చేసుకున్నాడు. 

ఎక్స్‌ట్రా ప్లేయర్‌ స్వస్తిక్‌ చికారా విరాట్‌ను ఇంప్రెస్‌ చేసే క్రమంలో గంగ్నమ్‌ స్టయిల్‌ డ్యాన్స్‌ చేశాడు. 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన తర్వాత విరాట్‌ కోహ్లి, 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచాక శ్రేయస్‌ అయ్యర్‌ ఇదే తరహా సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. తాజాగా చికారా గంగ్నమ్‌ స్టయిల్‌ డ్యాన్స్‌ వేయడంతో శ్రేయస్‌ అయ్యర్‌ను ఎగతాళి చేశాడనే అభిప్రాయం కలుగుతుంది. ఆర్సీబీ వ్యతిరేకులు ఈ విషయాన్ని హైలైట్‌ చేస్తున్నారు. 

వాస్తవానికి ఆ సమయంలో చికారా శ్రేయస్‌ గురించి ఆలోచించకపోయి ఉండవచ్చు. కేవలం విరాట్‌ను ఇంప్రెస్‌ చేయడంలో భాగంగానే ఆ డ్యాన్స్‌ చేసి ఉండవచ్చు. ఈ సీజన్‌ ప్రారంభం నుంచి చికారా విరాట్‌ మెప్పు పొందడమే పనిగా పెట్టుకున్నాడు. విరాట్‌ ఎక్కడికెళ్లిన అతని పక్కనే చికారా ఉండేవాడు. 20 ఏళ్ల చికారాకు ఇదే తొలి ఐపీఎల్‌ సీజన్‌. ఈ సీజన్‌లో అతనికి ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. చికారాకు క్లీన్‌ హిట్టర్‌గా పేరుంది. భవిష్యత్తులో అతను విరాట్‌తో ఆడే అవకాశాలు లేకపోలేదు. విరాట్‌ మరికొన్ని సీజన్లు ఐపీఎల్‌ ఆడితే చికారా కల నెరవేరవచ్చు.
 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)