#SRH: సీఎస్‌కే కంచు కోట బ‌ద్ద‌లు .. 12 ఏళ్ల త‌ర్వాత తొలిసారి

Published on Fri, 04/25/2025 - 23:28

ఐపీఎల్‌-2025లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌మ ప్లే ఆఫ్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెపాక్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన కీల‌క మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ విజ‌యం సాధించింది. 155 ప‌రుగుల ల‌క్ష్యాన్ని స‌న్‌రైజ‌ర్స్ 5 వికెట్లు కోల్పోయి 18.4 ఓవ‌ర్ల‌లో చేధించింది. 

ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో ఇషాన్ కిష‌న్(44) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. క‌మిందు మెండిస్‌(32 నాటౌట్‌), నితీష్ కుమార్ రెడ్డి(19 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో నూర్ ఆహ్మ‌ద్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. జ‌డేజా, ఖాలీల్ అహ్మ‌ద్‌, కాంబోజ్ త‌లా వికెట్ సాధించారు. కాగా చెపాక్‌లో సీఎస్‌కేపై ఎస్ఆర్‌హెచ్ విజ‌యం సాధించ‌డం 12 ఏళ్ల త‌ర్వాత ఇదే తొలిసారి కావ‌డం విశేషం.

ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 19.5 ఓవ‌ర్ల‌లో 154 ప‌రుగుల‌కే ఆలౌటైంది. సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో డెవాల్డ్ బ్రెవిస్‌(42) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. మాత్రే(30), ర‌వీంద్ర జ‌డేజా(21) రాణించారు. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో హ‌ర్ష‌ల్ ప‌టేల్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ప్యాట్ క‌మ్మిన్స్‌, జ‌య‌దేవ్ ఉన‌ద్క‌ట్ త‌లా రెండు వికెట్లు సాధించారు. ఈ ఓట‌మితో సీఎస్‌కే ప్లే ఆఫ్ ఆశ‌లు దాదాపు గ‌ల్లంతు అయిన‌ట్లే.
చ‌ద‌వండి: IPL 2025: చ‌రిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనే

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)