Breaking News

IPL 2025: ‘ఇదొక అద్భుత విజయం.. ప్లే ఆఫ్స్‌ చేరతాం’

Published on Sat, 04/26/2025 - 13:19

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఆరంభ మ్యాచ్‌లో గెలుపొందిన కమిన్స్‌ బృందం.. ఆ తర్వాత మళ్లీ ఒకే ఒక్కటి గెలిచి.. వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడింది. దీంతో ప్లే ఆఫ్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK vs SRH)తో శుక్రవారం తలపడ్డ సన్‌రైజర్స్‌.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో జయభేరి మోగించింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రాణించి పన్నెండేళ్ల తర్వాత చెపాక్‌ స్టేడియంలో తొలి విజయం నమోదు చేసింది. అంతేకాదు.. ప్లే ఆఫ్స్‌ ఆశలను కూడా సజీవం చేసుకుంది.

ఇదొక అద్భుత విజయం
ఈ క్రమంలో విజయానంతరం సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins) హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈరోజు మాకు అన్నీ కలిసివచ్చాయి. మా వాళ్లు గొప్పగా ఆడారు. ఇదొక అద్భుత విజయం. కష్టపడినందుకు ఫలితం దక్కింది.

సీఎస్‌కేలో ప్రతిభావంతులైన టాపార్డర్‌ బ్యాటర్లు ఉన్నారు. మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా వారికి ఉంది. అయితే, మా బౌలర్లు మొమెంటమ్‌ను మార్చేశారు. పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్‌ చేసి ఇన్నింగ్స్‌ దిశను మార్చివేశారు.

ప్లే ఆఫ్స్‌ చేరేందుకు కృషి చేస్తాం
వారి ప్రదర్శన పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. సీఎస్‌కేపై మాకు మంచి రికార్డు లేదు. కానీ ఈరోజు మేము గత పరాభవాలకు చెక్‌ పెట్టగలిగాం. ఈ సీజన్‌లో మాకు ఇంకా ఐదు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఎంత కష్టమైనా ప్లే ఆఫ్స్‌ చేరేందుకు కృషి చేస్తాం.

ఇంతకంటే గొప్పగా గెలిచేందుకు ప్రయత్నిస్తాం. అయితే, ఏదేమైనా ఈనాటి విజయం మాకు ప్రత్యేకమైనది’’ అని కమిన్స్‌ చెప్పుకొచ్చాడు. ఈసారి కూడా ప్లే ఆఫ్స్‌ చేరతామనే నమ్మకం ఉందని పరోక్షంగా వెల్లడించాడు.

వ్యూహంలో భాగమే
అదే విధంగా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పుల గురించి చెబుతూ.. ‘‘వ్యూహం ప్రకారమే హెన్రిచ్‌ క్లాసెన్‌ను నాలుగో స్థానంలో పంపించాం. మధ్య ఓవర్లలో వారు స్పిన్‌ మంత్రంతో ముందుకు వస్తారని తెలుసు.

అందుకే క్లాసెన్‌ ముందుగా బ్యాటింగ్‌కు వచ్చాడు. అదే విధంగా నితీశ్‌ రెడ్డికి ఫినిషర్‌ పాత్ర ఇచ్చాము’’ అని కమిన్స్‌ తెలిపాడు. కాగా ఐపీఎల్‌-2024లో సన్‌రైజర్స్‌ రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఈ సీజన్‌లో ఇప్పటికి ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం మూడే గెలిచి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ప్లే ఆఫ్స్‌ చేరే అవకాశాలు లేవు.

ఐపీఎల్‌-2025: సీఎస్‌కే వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌
👉టాస్‌: ఎస్‌ఆర్‌హెచ్‌.. మొదట బౌలింగ్‌
👉సీఎస్‌కే స్కోరు: 154 (19.5)
👉ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోరు:  155/5 (18.4)
👉ఫలితం: సీఎస్‌కేపై ఐదు వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయం
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: హర్షల్‌ పటేల్‌ (4/28).

చదవండి: CSK vs SRH: ‘బుర్ర పనిచేయడం లేదా’?!.. మెండిస్‌పై కావ్యా మారన్‌ ఫైర్‌!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)