Breaking News

అదే మా కొంప‌ముంచింది.. ఏదీ కలిసి రావడం లేదు: సీఎస్‌కే కెప్టెన్‌

Published on Sat, 04/05/2025 - 23:13

ఐపీఎల్‌-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో సీఎస్‌కే ఓటమి పాలైంది. బౌలింగ్‌, బ్యాటింగ్ రెండింటిలోనూ చెన్నై తేలిపోయింది. 184 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 158 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. 

సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో విజ‌య్ శంక‌ర్ 69 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ఎంఎస్ ధోని(30 నాటౌట్‌) ప‌ర్వాలేద‌న్పించాడు. మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో విప్ర‌జ్ నిగ‌మ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ముఖేష్ కుమార్‌, కుల్దీప్ యాద‌వ్‌,  స్టార్క్ త‌లా వికెట్ సాధించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనం‍తరం సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫ్యలమే తమ ఓటమికి కారణమని గైక్వాడ్ వెల్లడించాడు.

"గత కొన్ని మ్యాచ్‌ల నుంచి మాకు ఏదీ కలిసి రావడం లేదు. ప్రతీ మ్యాచ్‌లోనూ మేము మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తున్నాము. కానీ మేము ఆశించిన ఫలితం మాత్రం రావడం లేదు. ఈ మ్యాచ్‌లో పవర్ ప్లేలో ఎక్కువగా వికెట్లు కోల్పోయాము. బౌలింగ్‌లో కూడా మేము చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాము. 

అదనంగా 15 నుంచి 20 పరుగులు అదనంగా ఇస్తున్నాం.  లేదంటే పవర్ ప్లేలోనే ఎక్కువ వికెట్లు కోల్పోతున్నాం. లోపాలను సరిదిద్దుకోవాడనికి ప్రయత్నిస్తున్నాము. కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు. పవర్ ప్లేలో మేం అతి జాగ్రత్తగా బ్యాటింగ్, బౌలింగ్ చేస్తుండటం మాకు నష్టం కలిగిస్తోంది అన్పిస్తోంది.

ప‌వ‌ర్ ప్లేలో ఎక్కువ‌గా వికెట్లు కోల్పోతుండ‌డంతో బ్యాక్‌ఫుట్‌లో ఉండిపోతున్నాము. అంద‌రూ స‌మిష్టిగా రాణించాల్సిన అవ‌స‌ర‌ముంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బౌల‌ర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పిచ్ కండీష‌న్స్‌ను చ‌క్క‌గా ఉప‌యోగించుకున్నారు. శివ‌మే దూబే క్రీజులో ఉన్న‌ప్పుడు మేము ఆ మూమెంట‌మ్ అందుకుంటామ‌ని భావించాము. కానీ అలా జ‌ర‌గలేదు" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేష‌న్‌లో గైక్వాడ్ పేర్కొన్నాడు.
 

Videos

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు