IPL 2025: పదేళ్ల వయసులోనే 90 మీటర్ల భారీ సిక్సర్లు కొట్టాడు, ఇదెంత: వైభవ్‌ కోచ్‌ ఓఝా

Published on Tue, 04/29/2025 - 16:19

14 ఏళ్ల వయసులో ప్రపంచ స్థాయి బౌలర్లను గడగడలాడిస్తూ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన వైభవ్‌ సూర్యవంశీవైపు ప్రస్తుతం ప్రపంచం మొత్తం చూస్తుంది. ఈ కుర్రాడు ఎవరు..? అతని బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటి అని తెలుసుకునే పనిలో పడ్డారు క్రికెట్‌ అభిమానులు. ఈ క్రమంలో వైభవ్‌కు సంబంధించిన చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

ఇండియా టుడే ఇచ్చిన ఇంటర్వ్యూలో వైభవ్‌ చిన్ననాటి కోచ్‌ మనీశ్‌ ఓఝా చాలా విషయాలు చెప్పాడు. బ్రియాన్‌ లారాకు వీరాభిమాని అయిన వైభవ్‌లో నమ్మశక్యంకాని సిక్స్‌ హిట్టింగ్‌ ప్రతిభ ఉందని వెల్లడించాడు. వైభవ్‌ టాలెంట్‌ ముందు ఈ సెంచరీ చిన్నది అన్ని అన్నాడు. వైభవ్‌ పదేళ్ల వయసులోనే 90 మీటర్ల భారీ సిక్సర్లు కొట్టేవాడని.. రోజూ నెట్స్‌లో 350–400 బంతులు ఎదుర్కొనేవాడని తెలిపాడు.

వైభవ్‌ గురించి అతడి ఓఝా మాటల్లో.. వైభవ్‌కు శిక్షణ ఇస్తున్న సమయంలో ఒక్కసారి కూడా  తిట్టాల్సిన అవసరం రాలేదు. వైభవ్‌కు ఏ షాట్‌ నేర్పించినా,  ఏ టెక్నిక్‌ను వివరించినా దాన్ని పునరావృతం చేయాల్సిన అవసరం లేదు. అతను వెంటనే గ్రహిస్తాడు. వైభవ్‌ను పదిన్నరేళ్ల వయసులో తొలిసారి చూశాను.

ఆ వయసులోనే అతను ప్రపంచ స్థాయి బ్యాటర్ల సామర్థ్యం కలిగి ఉన్నాడు. 2022లో ఓఝా కోచింగ్ సెంటర్‌లో నిర్వహించిన ఓ మ్యాచ్‌లో వైభవ్ 118 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో  అతను కొట్టిన సిక్సర్లు ఇప్పుడు ప్రజలు చూస్తున్న సిక్సర్ల మాదిరిగానే ఉన్నాయి. ప్రతి సిక్సర్‌ 90 మీటర్లపైనే ఉం​డింది. ఆ సమయంలోనే వైభవ్‌ శక్తి, ఖచ్చితత్వం అసాధారణంగా ఉండేది. ఆ రోజే వైభవ్‌ అద్భుతాలు చేయగలడని నమ్మాను.

14 ఏళ్ల పిల్లాడిలో ఇంత శక్తి ఎలా వస్తుందనే దానిపై స్పందిస్తూ.. వైభవ్‌లో ఈ అబ్బురపరిచే శక్తి ప్రమాదవశాత్తు వచ్చింది కాదు. అతను భారీ సిక్సర్లు కొట్టే ప్రయత్నం చేయబట్టి నాలుగేళ్లవుతుంది. వైభవ్‌లో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. అదే కాన్ఫిడెన్స్‌తో అతను భారీ షాట్లు ఆడుతాడు. 

వైభవ్‌కు ఈ స్థాయి సిక్స్‌ హిట్టింగ్‌ సామర్థ్యం రావడానికి అతని కఠోర ప్రాక్టీస్‌ కూడా ఓ కారణం. వైభవ్‌ టైమింగ్‌, టెక్నిక్‌ కూడా అద్భుతంగా ఉంటుంది. అతడికి ప్రాక్టీస్‌లో రోబోలతో త్రోలు వేయించేవాడిని. వైభవ్‌ ఎక్కువగా ఫుల్‌ టాస్‌ బంతులకు షాట్లు ప్రాక్టీస్‌ చేసేవాడు. రికార్డు సెంచరీకి ముందు రోజు కూడా వైభవ్‌తో మాట్లాడినట్లు ఓఝా తెలిపాడు.

కాగా, ఐపీఎల్‌ 2025లో భాగంగా నిన్న గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్‌ 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, పొట్టి క్రికెట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా, ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డులు నెలకొల్పాడు.

ఈ మ్యాచ్‌లో వైభవ్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లపై 11 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇందులో మూడు సిక్సర్లు 85 మీటర్లకు పైబడినవి కాగా..  రెండు 90 మీటర్లు దాటి ప్రయాణించాయి. కొన్ని సిక్సర్లు స్టేడియంలోని స్టాండ్స్ పైకప్పుపై కూడా పడ్డాయి.

 

 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)