Breaking News

IPL 2025: 'ఈ లెక్కన' ఈ సారి ఆర్సీబీదే టైటిల్‌..!

Published on Fri, 05/30/2025 - 16:46

ఐపీఎల్‌ 2025లో భాగంగా నిన్న (మే 29) జరిగిన తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. ఐపీఎల్‌లో ఆర్సీబీకి ఇది నాలుగో ఫైనల్‌ అవుతుంది. గడిచిన మూడు సందర్భాల్లో ఈ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

ఆర్సీబీ ఫైనల్‌కు చేరిన సీజన్లు..
2009- డెక్కన్‌ ఛార్జర్స్‌ చేతిలో 6 పరుగుల తేడాతో ఓటమి
2011- సీఎస్‌కే చేతిలో 58 పరుగుల తేడాతో ఓటమి
2016- ఎస్‌ఆర్‌హెచ్‌ చేతిలో 8 పరుగుల తేడాతో ఓటమి
2025- ?

కాగా, ఈ సీజన్‌లో ఆర్సీబీ ఫైనల్‌కు చేరాక ఓ ఆసక్తికర విషయం ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రతి సీజన్‌లో ఈ సాలా కప్‌ నమదే అనే ఆర్సీబీ అభిమానులకు ఇది ఊపునిచ్చే అంశం. అదేంటంటే.. 2018 నుంచి క్వాలిఫయర్‌-1లో గెలిచిన జట్టే టైటిల్‌ గెలిచింది. ఈ విషయం తెలిసి ఆర్సీబీ అభిమానులు ఉబ్బితబ్బిబవుతున్నారు. ఈ ఒక్క సెంటిమెంట్‌ చాలు మేము ఈ యేడు కప్‌ కొడతామని చెప్పడానికంటూ చాటింపు చేసుకుంటున్నారు.

సెంటిమెంట్‌ విషయాన్ని పక్కన పెడితే, ఈ యేడు ఆర్సీబీకి టైటిల్‌ గెలిచే జట్టుకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఆర్సీబీ ఈ సీజన్‌లో గత సీజన్లకు చాలా భిన్నంగా కనిపిస్తుంది. టైటిల్‌ గెలవాలన్న కసి ఆ జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడిలో ఉంది. అందుకు తగ్గట్టుగానే వారి ప్రదర్శనలు కూడా ఉన్నాయి. 

పైపెచ్చు ప్రతి సీజన్‌లో వీక్‌గా కనిపించే ఆర్సీబీ బౌలింగ్‌ విభాగం ఈ సీజన్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. నిన్న జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో అది నిరూపితమైంది. ఇదే జోరును ఆర్సీబీ బౌలర్లు ఫైనల్‌ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తే, ఆ జట్టును టైటిల్‌ గెలవకుండా ఎవరూ ఆపలేరు.

ఈ సారి ఆర్సీబీకి పటిష్టమైన జట్టుతో పాటు సెంటిమెంట్లు కూడా వర్కౌటయ్యేలా ఉన్నాయి. క్వాలిఫయర్‌-1 సెంటిమెంట్‌తో పాటు విరాట్‌ కోహ్లి జెర్సీ నంబర్‌ సెంటిమెంట్‌ కూడా ఆ జట్టుకు ఈ సారి కలిసొచ్చేలా ఉంది. కోహ్లి జెర్సీ నంబర్‌ 18, ఐపీఎల్‌ సీజన్‌ సంఖ్య కూడా 18.

2018 నుంచి క్వాలిఫయర్‌-1 గెలిచిన జట్లు, టైటిల్‌ గెలిచిన జట్ల వివరాలు..

2018- క్వాలిఫయర్‌-1 విజేత సీఎస్‌కే- టైటిల్‌ విజేత కూడా సీఎస్‌కేనే
2019- క్వాలిఫయర్‌-1 విజేత ముంబై ఇండియన్స్‌- టైటిల్‌ విజేత కూడా ముంబై ఇండియన్సే
2020- క్వాలిఫయర్‌-1 విజేత ముంబై ఇండియన్స్‌- టైటిల్‌ విజేత కూడా ముంబై ఇండియన్సే
2021-  క్వాలిఫయర్‌-1 విజేత సీఎస్‌కే- టైటిల్‌ విజేత కూడా సీఎస్‌కేనే
2022-  క్వాలిఫయర్‌-1 విజేత గుజరాత్‌- టైటిల్‌ విజేత కూడా గుజరాతే
2023-  క్వాలిఫయర్‌-1 విజేత సీఎస్‌కే- టైటిల్‌ విజేత కూడా సీఎస్‌కేనే
2024-  క్వాలిఫయర్‌-1 విజేత కేకేఆర్‌- టైటిల్‌ విజేత కూడా కేకేఆరే
2025-  క్వాలిఫయర్‌-1 విజేత ఆర్సీబీ- టైటిల్‌ విజేత..?

 

 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)