Breaking News

IPL 2025: ఈ సాలా కప్‌ ఆర్సీబీదే.. ఫైనల్లో పంజాబ్‌పై ఘన విజయం

Published on Tue, 06/03/2025 - 23:39

ఎట్టకేలకు 18వ ప్రయత్నంలో ఆర్సీబీ ఐపీఎల్‌ టైటిల్‌ కల సాకారమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో ఇవాళ (జూన్‌ 3) జరిగిన ఐపీఎల్‌ 2025 ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. 

చివరి ఓవర్‌ను అర్షదీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇతర బౌలర్లలో జేమీసన్‌ 3, ఒమర్‌జాయ్‌, విజయ్‌కుమార్‌ వైశాక్‌, చహల్‌ తలో వికెట్‌ తీశారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో 35 బంతుల్లో 43 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లినే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో సాల్ట్‌16, లివింగ్‌స్టోన్‌ 25, జితేశ్‌ శర్మ 24, మయాంక్‌ అగర్వాల్‌ 24, రజత్‌ పాటిదార్‌ 26, రొమారియో షెపర్డ్‌ 17, కృనాల్‌ పాండ్యా 4, భువనేశ్వర్‌ కుమార్‌ 1 పరుగు చేసి ఔటయ్యారు.

అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇన్నింగ్స్‌ మధ్యలో ఒత్తిడికి లోనైన పంజాబ్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. ఆఖర్లో శశాంక్‌ సింగ్‌ (30 బంతుల్లో 61 నాటౌట్‌; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) పంజాబ్‌ను గెలిపించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. అయితే అప్పటకే మ్యాచ్‌ పంజాబ్‌ చేతుల్లో నుంచి జారి పోయింది. 

పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ప్రియాంశ్‌ ఆర్మ 24, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ 26, జోస్‌ ఇంగ్లిస్‌ 39, శ్రేయస్‌ అయ్యర్‌ 1, నేహల్‌ వధేరా 15, స్టోయినిస్‌ 6, ఒమర్‌జాయ్‌ 1 పరుగు చేసి ఔటయ్యారు.ఆర్సీబీ బౌలర్లులో కృనాల్ పాండ్యా (4-0-17-2) అద్బుతంగా బౌలింగ్‌ చేసి పంజాబ్‌ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. భువనేశ్వర్‌ కుమార్‌ 2, యశ్‌ దయాల్‌, హాజిల్‌వుడ్‌, షెపర్డ్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. 

ఈ గెలుపుతో ఆర్సీబీతో పాటు ఆ జట్టు స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి కల కూడా సాకారమైంది. ఐపీఎల్‌ ప్రారంభం నుంచి ఆర్సీబీకే ఆడుతున్న విరాట్‌ ఎట్టకేలకు 18వ సీజన్‌లో టైటిల్‌ కలను సాకారం చేసుకున్నాడు. విరాట్‌కు 18 నంబర్‌ మరోసారి కలిసొచ్చింది. విరాట్‌ జెర్సీ నంబర్‌ కూడా 18 అన్న విషయం​ తెలిసిందే. టైటిల్‌ గెలిచాక విరాట్‌ తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు.  

 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)