Breaking News

IPL 2025: చరిత్ర సృష్టించిన భువనేశ్వర్‌ కుమార్‌

Published on Thu, 04/03/2025 - 12:23

ఆర్సీబీ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ చరిత్ర సృష్టించాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 2) జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ను ఔట్‌ చేయడం ద్వారా ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా డ్వేన్‌ బ్రావో రికార్డును సమం చేశాడు. బ్రావో 158 ఇన్నింగ్స్‌ల్లో 183 వికెట్లు తీయగా.. ఈ మార్కు తాకడానికి భువీకి 178 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్‌ పేరిట ఉంది. 

చహల్‌ 161 ఇన్నింగ్స్‌ల్లో 206 వికెట్లు తీశాడు. చహల్‌ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన ఘనత పియూశ్‌ చావ్లాకు దక్కుతుంది. చావ్లా 191 ఇన్నింగ్స్‌ల్లో 912 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చహల్‌ , చావ్లా తర్వాత భువీ, బ్రావో ఉన్నారు. వీరిద్దరితో సమానంగా అశ్విన్‌ కూడా 183 వికెట్లు తన ఖాతాలో కలిగి ఉన్నాడు. యాష్‌కు 183 వికెట్ల మార్కును తాకడానికి 211 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.

కాగా, నిన్న సొంత మైదానంలో (చిన్నస్వామి స్టేడియం) గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ సీజన్‌లో ఆ జట్టుకు ఇదే తొలి ఓటమి. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ ఆదిలోనే వికెట్లు కోల్పోయి నామమాత్రపు స్కోర్‌కు (169/8) పరిమితమైంది. లివింగ్‌స్టోన్‌ (40 బంతుల్లో 54; ఫోర్‌, 5 సిక్సర్లు), టిమ్‌ డేవిడ్‌ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జితేశ్‌ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్‌) పోరాడటంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

గుజరాత్‌ బౌలర్లలో సిరాజ్‌ 3 వికెట్లు తీసి ఆర్సీబీకి దెబ్బకొట్టాడు. సిరాజ్‌ తన మాజీ జట్టుపై మ్యాచ్‌ విన్నింగ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. సిరాజ్‌తో పాటు సాయికిషోర్‌ (2), అర్షద్‌ ఖాన్‌ (1), ప్రసిద్ద్‌ కృష్ణ (1), ఇషాంత్‌ శర్మ (1) కూడా వికెట్లు తీశారు. సిరాజ్‌ తన కోటా 4 ఓవర్లలో కేవలం​ 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్‌ బట్లర్‌ (39 బంతుల్లో 73 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్‌ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్‌), షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (18 బంతుల్లో 30 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు) నిలకడగా ఆడి గుజరాత్‌ను గెలిపించారు. ఆఖర్లో బట్లర్‌, రూథర్‌ఫోర్డ్‌ బ్యాట్‌ను ఝులిపించారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్‌, భువనేశ్వర్‌ కుమార్‌ తలో వికెట్‌ తీశారు. 

ఈ గెలుపుతో గుజరాత్‌ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకి​ంది. ఈ మ్యాచ్‌కు ముందు టాప్‌ ప్లేస్‌లో ఉండిన ఆర్సీబీ మూడో స్థానానికి పడిపోయింది. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)