Breaking News

RCB Vs RR: రికార్డు అర్ద శతకంతో సత్తా చాటిన విరాట్‌.. రాయల్స్‌పై ఆర్సీబీ ఘన విజయం

Published on Sun, 04/13/2025 - 19:02

ఐపీఎల్‌ 2025లో భాగంగా జైపూర్‌ వేదికగా ఇవాళ (ఏప్రిల్‌ 13) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజ​స్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 

రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (47 బంతుల్లో 75; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. ధృవ్‌ జురెల్‌ (35 నాటౌట్‌), రియాన్‌ పరాగ్‌ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (15) మరోసారి నిరాశపర్చగా.. ఆఖర్లో వచ్చిన హెట్‌మైర్‌ 9, నితీశ్‌ రాణా 4 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌, హాజిల్‌వుడ్‌, కృనాల్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 17.3 ఓవర్లలో ఫిల్‌ సాల్ట్‌ (33 బంతుల్లో 65; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. విరాట్‌ కోహ్లి (45 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టీ20 కెరీర్‌లో 100 హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. పడిక్కల్‌ (28 బంతుల్లో 40 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌) బౌండరీ కొట్టి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా.. రాయల్స్‌ అదే ఏడో స్థానంలో కొనసాగుతుంది. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)