Breaking News

పడిక్కల్‌ విధ్వంసం, సత్తా చాటిన విరాట్‌.. పంజాబ్‌పై ప్రతీకారం​ తీర్చుకున్న ఆర్సీబీ

Published on Sun, 04/20/2025 - 19:33

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 20) మధ్యాహ్నం ముల్లాన్‌పూర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  ఈ గెలుపుతో ఆర్సీబీ గత మ్యాచ్‌లో పంజాబ్‌ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఇరు జట్ల మధ్య రెండు రోజుల కిందటే బెంగళూరు వేదికగా మ్యాచ్‌ జరగగా.. ఆ మ్యాచ్‌లో పంజాబ్‌ ఆర్సీబీని చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో పంజాబ్‌ను వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం గుజరాత్‌, ఢిల్లీ, ఆర్సీబీ, పంజాబ్‌, లక్నో తలో 10 పాయింట్లతో టాప్‌-5లో ఉన్నాయి.  

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. పవర్‌ ప్లేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆర్సీబీ బౌలర్లు.. ఆతర్వాత అనూహ్య రీతిలో పుం​జుకుని పంజాబ్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. ఆర్సీబీ బౌలర్లలో  కృనాల్‌ పాండ్యా, సుయాశ్‌ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. రొమారియో షెపర్డ్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

భువనేశ్వర్‌ కుమార్‌, హాజిల్‌వుడ్‌ వికెట్లు తీయకపోయినా.. పొదుపుగా బౌలింగ్‌ చేశారు. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (33) టాప్‌ స్కోరర్‌గా కాగా.. ప్రియాన్ష్‌ ఆర్య 22, శ్రేయస్‌ అ‍య్యర్‌ 6, జోస్‌ ఇంగ్లిస్‌ 29, నేహల్‌ వధేరా 5, స్టోయినిస్‌ 1, శశాంక్‌ సింగ్‌ 31 (నాటౌట్‌), జన్సెన్‌ 25 (నాటౌట్‌) పరుగులు చేశారు.

అనంతరం 158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. విరాట్‌ అజేయ అర్ద శతకంతో (54 బంతుల్లో 73 నాటౌట్‌; 7 ఫోర్లు, సిక్స్‌) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించగా.. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో ఆర్సీబీ గెలుపుకు గట్టి పునాది వేశాడు. 

జితేశ్‌ శర్మ (8 బంతుల్లో 11 నాటౌట్‌; సిక్స్‌) సిక్సర్‌ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో సాల్ట్‌ (1), రజత్‌ పాటిదార్‌ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. పంజాబ్‌ బౌలర్లలో అర్షదీప్‌, హర్ప్రీత్‌ బ్రార్‌, చహల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)