RCB Vs LSG: వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడిన జితేశ్‌.. ఉత్కంఠ పోరులో లక్నోపై ఆర్సీబీ ఘన విజయం

Published on Tue, 05/27/2025 - 23:49

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (మే 27) జరిగిన ఉత్కంఠ పోరులో లక్నోపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో భారీ స్కోర్‌ (227/3) చేసింది. రిషబ్‌ పంత్‌ (61 బంతుల్లో 118 నాటౌట్‌; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.  

మిచెల్‌ మార్ష్‌ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో అలరించాడు. లక్నో ఇన్నింగ్స్‌లో మాథ్యూ బ్రీట్జ్కీ 14, పూరన్‌ 13 పరుగులు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో తుషార, భువనేశ్వర్‌ కుమార్‌, షెపర్డ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ విజయవంతమైంది. ఆ జట్టు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జితేశ్‌ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్‌; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచితమైన ఇన్నింగ్స్‌ ఆడి ఆర్సీబీని గెలిపించాడు. అతనికి మయాంక్‌ అగర్వాల్‌ (23 బంతుల్లో 41 నాటౌట్‌; 5 ఫోర్లు) సహకరించాడు. 

అంతకుముందు విరాట్‌ కోహ్లి (30 బంతుల్లో 54; 10 ఫోర్లు), ఫిల్‌ సాల్ట్‌ (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ఆర్సీబీ గెలుపుకు పునాది వేశారు. లక్నో బౌలర్లలో విలియమ్‌ ఓరూర్కీ 2, ఆకాశ్‌ సింగ్‌, ఆవేశ్‌ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు. ఈ గెలుపుతో ఆర్సీబీ టేబుల్‌ సెకెండ్‌ టాపర్‌గా నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరింది.

మే 29న జరిగే క్వాలిఫయర్‌-1లో ఆర్సీబీ.. పంజాబ్‌తో తలపడనుంది. మే 30న జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గుజరాత్‌, ముంబై ఇండియన్స్‌ అమీతుమీ తేల్చుకుంటాయి.  

 

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)