RR VS GT: వైభవ్‌ సృష్టించిన బీభత్సం మాటల్లో వర్ణించలేనిది: రాజస్థాన్‌ కెప్టెన్‌

Published on Tue, 04/29/2025 - 11:33

ఐపీఎల్‌ 2025లో నిన్న (ఏప్రిల్‌ 28) గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కుర్రాడు వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర శతకంతో (35 బంతుల్లో) విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ సెంచరీతో వైభవ్‌ చాలా రికార్డులను కొల్లగొట్టాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్‌ విధ్వంసకాండ దెబ్బకు రాయల్స్‌ 15.5 ఓవర్లలోనే గుజరాత్‌ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయం సాధించింది. 

రాయల్స్‌ గెలుపులో వైభవ్‌లో పాటు (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) మరో ఓపెనర్‌  యశస్వి జైస్వాల్‌ (40 బంతుల్లో 70 నాటౌట్‌; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా కీలకపాత్ర పోషించాడు. ఆఖర్లో రియాన్‌ పరాగ్‌ (15 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు.

అంతకుముందు  శుభ్‌మన్‌ గిల్‌ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్‌ బట్లర్‌ (26 బంతుల్లో​ 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు‌), సాయి సుదర్శన్‌ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్‌) సత్తా చాటడంతో గుజరాత్‌ 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో వైభవ్‌ సృష్టించిన బీభత్సం పొట్టి క్రికెట్‌ బ్రతికున్నంతవరకు గుర్తుంటుంది. వైభవ్‌ కేవలం 14 ఏళ్ల 32 రోజుల వయసులో ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ చేసిన విలయ తాండవాన్ని క్రికెట్‌ అభిమానులు ఎన్నటికి మర్చిపోరు. ఈ ఇన్నింగ్స్‌ తర్వాత వైభవ్‌పై యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తుంది. పాల బుగ్గల కుర్రాడు ఇలాంటి విలయాన్ని సృష్టించడమేంటని జనాలు ఆశ్చర్యపోతున్నారు.

నిన్నటి మ్యాచ్‌ తర్వాత అందరి లాగే రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ కూడా వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. పరాగ్‌ మాటల్లో.. ఇది చాలా అద్భుతంగా ఉంది. మేము వైభవ్‌తో 2 నెలలు గడిపాము. అతను ఏమి చేయగలడో చూశాము. మాకందరికీ తెలుసు వైభవ్‌ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌ వస్తుందని. ప్రపంచ స్థాయి బౌలర్లైన గుజరాత్‌ బౌలర్లపై వైభవ్‌ సృష్టించిన బీభత్సకాండను మాటల్లో వర్ణించలేను.

గత మూడు మ్యాచ్‌ల్లో స్వయంకృతాపరాధాల చేత చివరి నిమిషంలో మ్యాచ్‌లు కోల్పోయాము. ఈ మ్యాచ్‌లో అలా జరగకూడదనే మా ఆటతీరును మార్చాము. వీలైనంత త్వరగా మ్యాచ్‌ను ముగించాలని అనుకున్నాము. ఈ ఫలితం కోసం మేము చాలా కష్టపడ్డాము. మా ప్రణాళికలను విజయవంతంగా అమలు చేయగలిగాము. 

ఐపీఎల్‌లో ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఈ సీజన్‌లో ఆర్సీబీ ప్రయాణం. సూర్య భాయ్ ఆటతీరు. ఇలా చాలా విషయాలను గమనిస్తున్నాము. ఈ విజయం చాలా పెద్దది. ఇలాంటి విజయాల కోసమే మేము అన్వేషిస్తున్నాము. ఈ విజయం ఏకపక్షంగా వచ్చింది. ఇది చాలా సంతోషాన్నిస్తుంది. తదుపరి మ్యాచ్‌లో ఎలాంటి వికెట్‌ లభిస్తుందో చూడాలి. 
 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)