Breaking News

PBKS Vs MI: విధ్వంసం సృష్టించిన ఇంగ్లిస్‌, ఆర్య.. ముంబైపై పంజాబ్‌ గ్రాండ్‌ విక్టరీ

Published on Mon, 05/26/2025 - 23:22

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (మే 26) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై పంజాబ్‌ కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో గ్రాండ్‌ విక్టరీ సాధించింది.ఈ గెలుపుతో పంజాబ్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకి, టాప్‌-2లో స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఈ ఓటమితో ముంబై నాలుగో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

పాయింట్ల పట్టికలో ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్లు..
పంజాబ్‌- 19
గుజరాత్‌- 18
ఆర్సీబీ- 17 (ఇంకా ఓ మ్యాచ్‌ ఆడాల్సి ఉంది)
ముంబై- 16

సత్తా చాటిన సూర్యకుమార్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సూర్యకుమార్‌ మెరుపు అర్ద సెంచరీతో (57) సత్తా చాటాడు.

ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్‌ 27, రోహిత్‌ శర్మ 24, తిలక్‌ వర్మ 1, విల్‌ జాక్స్‌ 17, హార్దిక్‌ పాండ్యా 26, నమన్‌ ధిర్‌ 20 పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లలో జన్సెన్‌, విజయ్‌కుమార్‌ వైశాఖ్‌, అర్షదీప్‌ సింగ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హర్ప్రీత్‌ బ్రార్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

విధ్వంసం సృష్టించిన ఇంగ్లిస్‌, ప్రియాంశ్‌
అనంతరం 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌.. 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ప్రియాంశ్‌ ఆర్య 62, జోష్‌ ఇంగ్లిస్‌ 73, శ్రేయస్‌ అయ్యర్‌ 26 (నాటౌట్‌), ప్రభ్‌సిమ్రన్‌ 13, నేహల్‌ వధేరా 2 (నాటౌట్‌) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో సాంట్నర్‌ 2, బుమ్రా ఓ వికెట్‌ పడగొట్టారు. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)