Breaking News

'ఐపీఎల్‌ను ఇంగ్లండ్‌లో నిర్వ‌హించండి'.. బీసీసీఐకి మాజీ క్రికెట‌ర్ సూచ‌న‌

Published on Fri, 05/09/2025 - 19:15

ఐపీఎల్‌-2025ను భార‌త క్రికెట్ బోర్డు వారం రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేసింది. భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ కీల‌క‌ నిర్ణ‌యం తీసుకుంది. ఈ టోర్నీ ఎప్పుడు పునఃప్రారంభమవుతుందో స్పష్టమైన తేదీని మాత్రం బీసీసీఐ వెల్ల‌డించ‌లేదు.

దీంతో విదేశీ ఆట‌గాళ్లు త‌మ స్వ‌దేశానికి ప‌య‌నం కానున్నారు. ఆ త‌ర్వాత ఐపీఎల్ తిరిగి ప్రారంభ‌మైన కూడా చాలా మంది ఆట‌గాళ్లు అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చు. అయితే మిగిలిన టోర్నీని విదేశాల‌కు త‌ర‌లించిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్ల‌లేదు. బీసీసీఐకు యూఏఈ మొద‌టి అప్ష‌న్‌గా ఎల్ల‌ప్పుడూ ఉంటుంది. 

కానీ పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌ల‌ను కూడా యూఏఈలోనే నిర్వ‌హించాల‌ని పీసీబీ నిర్ణ‌యించింది. దీంతో బీసీసీఐ ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను యూఏఈలో నిర్వ‌హిస్తుందా?  లేదా భార‌త్‌లోనే కొన‌సాగుస్తుందా అన్నది వేచి చూడాలి. ఈ క్ర‌మంలో భార‌త క్రికెట్ బోర్డుకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కీల‌క సూచ‌న‌లు చేశాడు. 

ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లను పూర్తి చేయడానికి ఇంగ్లండ్‌ను మంచి ఎంపికగా బీసీసీఐ ప‌రిగణించాల‌ని వాన్ అభిప్రాయ‌ప‌డ్డాడు. "ఐపీఎల్‌-2025లో మిగిలిన మ్యాచ్‌ల‌ను యూకేలో నిర్వ‌హిస్తే బాగుటుంది. మాకు చాలా స్టేడియాలు ఉన్నాయి.

అంతేకాకుండా భార‌త ఆట‌గాళ్లు ఐపీఎల్‌ను పూర్తి చేసుకుని టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్‌లోనే ఉండిపోవ‌చ్చు. ఇది కేవ‌లం నా ఆలోచ‌న మాత్ర‌మే" అని ఎక్స్‌లో వాన్ రాసుకొచ్చాడు. కాగా ఈ ఏడాది జూన్‌లో భార‌త జ‌ట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది.
చ‌దవండి: IPL 2025: ఐపీఎల్ వాయిదా ఎన్ని రోజులంటే? బీసీసీఐ కీల‌క‌ ప్ర‌క‌ట‌న‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)