Breaking News

IPL 2025: వేలంలో చహల్‌కు కళ్లు చెదిరే ధర.. జాక్‌పాట్‌ కొట్టేశాడు

Published on Sun, 11/24/2024 - 17:09

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ ఐపీఎల్‌ మెగా వేలం-2025లో జాక్‌పాట్‌ కొట్టాడు. ఏకంగా రూ. 18 కోట్లు కొల్లగొట్టాడు. కాగా ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చహల్‌ కొనసాగుతున్నాడు.

ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లకు ప్రాతినిథ్యం వహించిన చహల్‌.. ఏకంగా 205 వికెట్లు కూల్చాడు. తద్వారా ఇప్పటికీ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు.

ఇక ఐపీఎల్‌-2024లో రాజస్తాన్‌కు ఆడిన చహల్‌ 18 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, వేలానికి ముందు రాజస్తాన్‌ అతడిని వదిలేయగా.. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు.

ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఆదివారం జరిగిన మొదటి సెట్‌వేలంలో చహల్‌ కోసం.. గుజరాత్‌ తొలుత బిడ్‌ వేసింది. ఈ తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్‌ పోటీలో దిగింది. అయితే, ధర రూ. 15 కోట్లు దాటిన తర్వాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పోటీలోకి వచ్చింది. 

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా రంగంలోకి దిగింది. ఆ తర్వాత ఊహించినవిధంగా.. పంజాబ్‌ కింగ్స్‌ రేసులోకి వచ్చి ధరను రూ. 18 కోట్లకు పెంచింది. దీంతో సన్‌ రైజర్స్‌తప్పుకోగా.. పంజాబ్‌ చహల్‌ను దక్కించుకుంది.

చదవండి: Rishabh Pant: అయ్యర్‌ రికార్డు బ్రేక్‌.. కోట్లు కొల్లగొట్టిన పంత్‌! లక్నో సొంతం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)