Breaking News

IPL 2025 LSG vs DC: లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం

Published on Tue, 04/22/2025 - 19:06

IPL 2025 LSG vs DC Live Updates:  ఐపీఎల్-2025లో ఏక్నా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి.

లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
ఎక్నా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. 160 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఢిల్లీ కేవ‌లం రెండు వికెట్ల మాత్ర‌మే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో కేఎల్ రాహుల్‌(42 బంతుల్లో3 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో57 నాటౌట్‌), అభిషేక్ పోరెల్‌(36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 51) హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగగా.. అక్ష‌ర్ ప‌టేల్‌(20 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స్‌లతో 34 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ల‌క్నో బౌల‌ర్ల‌లో పార్ట్ టైమ్ స్పిన్న‌ర్ ఐడైన్ మార్క్‌ర‌మ్ ఒక్క‌డే రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మిగితా ల‌క్నో బౌల‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు.
ఢిల్లీ రెండో వికెట్ డౌన్‌..
అభిషేక్ పోరెల్‌(51) రూపంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ రెండో వికెట్ కోల్పోయింది. మార్‌క్ర‌మ్ బౌలింగ్‌లో పోరెల్ ఔట‌య్యాడు. ఢిల్లీ 15 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రెండు వికెట్ల న‌ష్టానికి 127 ప‌రుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్‌(40), అక్ష‌ర్ ప‌టేల్‌(17) ప‌రుగుల‌తో ఉన్నారు.
దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ
160 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌నలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ దూకుడుగా ఆడుతోంది. 11 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఢిల్లీ వికెట్ న‌ష్టానికి 96 ప‌రుగులు చేసింది. క్రీజులో అభిషేక్ పోరెల్‌(50), రాహుల్‌(28) ఉన్నారు.

ఢిల్లీ తొలి వికెట్ డౌన్‌..
క‌రుణ్ నాయ‌ర్ రూపంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 15 ప‌రుగులు చేసిన నాయ‌ర్‌.. మార్‌క్ర‌మ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. 3.4 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోర్‌: 36/1

నామ‌మాత్ర‌పు స్కోర్‌కే ప‌రిమితమైన ల‌క్నో
ఎక్నా స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నామ‌మాత్ర‌పు స్కోర్‌కే ప‌రిమిత‌మైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో ఐడైన్ మార్‌క్ర‌మ్‌(52) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా..మిచెల్ మార్ష్‌(45), ఆయూష్ బ‌దోని(36) రాణించారు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. స్టార్క్‌, చ‌మీరా త‌లా వికెట్ సాధించారు.

17 ఓవ‌ర్ల‌కు ల‌క్నో స్కోర్: 130/4
14వ ఓవ‌ర్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ వ‌రుస క్ర‌మంలో రెండు వికెట్లు కోల్పోయింది. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో తొలి బంతికి అబ్దుల్ స‌మ‌ద్ ఔట్ కాగా.. ఆఖ‌రి బంతికి మిచెల్ మార్ష్‌(45) క్లీన్ బౌల్డ‌య్యాడు. 17 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ల‌క్నో 4 వికెట్ల న‌ష్టానికి 130 ప‌రుగులు చేసింది. క్రీజులో మిల్ల‌ర్‌(11), బ‌దోని(10) ప‌రుగుల‌తో ఉన్నారు.

ల‌క్నో రెండో వికెట్ డౌన్‌
నికోల‌స్ పూర‌న్ రూపంలో ల‌క్నో రెండో వికెట్ కోల్పోయింది. 9 ప‌రుగులు చేసిన పూర‌న్‌.. స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు.

ల‌క్నో తొలి వికెట్ డౌన్‌..
ఐడైన్ మార్క్‌ర‌మ్ రూపంలో ల‌క్నో తొలి వికెట్ కోల్పోయింది. 52  ప‌రుగులు చేసిన దుష్మాంత చ‌మీరా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 10 ఓవ‌ర్ల‌కు ల‌క్నో వికెట్ న‌ష్టానికి 87 ప‌రుగులు చేసింది.

మార్‌క్ర‌మ్ ఫిప్టీ..
ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఓపెన‌ర్లు మార్‌క్ర‌మ్‌, మిచెల్ మార్ష్ దూకుడుగా ఆడుతున్నారు. 9 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ల‌క్నో వికెట్ న‌ష్టానికి 82 ప‌రుగులు చేసింది. క్రీజులో మార్ష్‌(32), మార్‌క్ర‌మ్‌(50) ఉన్నారు.

నిల‌క‌డ‌గా ఆడుతున్న ల‌క్నో.. 
మూడు ఓవ‌ర్లు ముగిసే స‌రికి ల‌క్నో వికెట్ న‌ష్ట‌పోకుండా 20 ప‌రుగులు చేసింది. క్రీజులో మ‌ర్క్‌ర‌మ్‌(13), మిచెల్ మార్ష్‌(6) ఉన్నారు.

ఐపీఎల్-2025లో మ‌రో కీల‌క పోరుకు రంగం సిద్ద‌మైంది. సెకెండ్ రౌండ్‌లో భాగంగా ఏక్నా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓ మార్పుతో బ‌రిలోకి దిగింది. మోహిత్ శ‌ర్మ స్దానంలో దుష్మాంత చ‌మీరా తుది జ‌ట్టులో వ‌చ్చాడు. ల‌క్నో మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతోంది.

తుది జ‌ట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI: అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్‌ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), అక్షర్ పటేల్ (కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్

లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్‌), అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్

 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)