Breaking News

గెలుపు వాకిట బోర్లా పడిన రాయల్స్‌.. ఉత్కంఠ పోరులో లక్నోను గెలిపించిన ఆవేశ్‌ ఖాన్‌

Published on Sat, 04/19/2025 - 23:32

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 19) రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై లక్నో సూపర్‌ జెయింట్స్‌ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగా.. రాయల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్‌లో రాయల్స్‌ గెలుపుకు 9 పరుగులు అవసరం కాగా.. ఆవేశ్‌ ఖాన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి కేవలం 6 పరుగులే ఇచ్చాడు.  

లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్‌ 66, ఆయుశ్‌ బదోని 50 పరుగులు  చేయగా.. ఆఖర్లో అబ్దుల్‌ సమద్‌ 10 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్‌ మార్ష్‌ (4), పంత్‌ (3) విఫలమయ్యారు. రాజస్థాన్‌ బౌలర్లలో హసరంగ 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్‌, సందీప్‌ శర్మ, తుషార్‌ దేశ్‌పాండే తలో వికెట్‌ దక్కించుకున్నారు.

ఛేదనలో యశస్వి జైస్వాల్‌ (74), వైభవ్‌ సూర్యవంశీ (34), రియాన్‌ పరాగ్‌ (39) అద్భుతంగా ఆడినప్పటికీ.. రాయల్స్‌ ఒత్తిడికి చిత్తై గెలుపు వాకిట బోర్లా పడింది. రాయల్స్‌ ఈ సీజన్‌లో ఇలా ఓడటం ఇది రెండో సారి. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ రాయల్స్‌ గెలుస్తుందనుకుంటే సూపర్‌ వరకు వెళ్లి ఓటమిపాలైంది. ఆవేశ్‌ ఖాన్‌ (4-0-37-3) ఒంటిచేత్తో రాయల్స్‌ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)