Breaking News

IPL 2025: లక్నోపై ఆర్సీబీ ఘన విజయం

Published on Tue, 05/27/2025 - 19:14

లక్నోపై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (మే 27) జరిగిన ఉత్కంఠ పోరులో లక్నోపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో.. రిషబ్‌ పంత్‌ (61 బంతుల్లో 118 నాటౌట్‌; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో భారీ స్కోర్‌ (227/3) చేసింది. 

అనంతరం ఆర్సీబీ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జితేశ్‌ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్‌; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచితమైన ఇన్నింగ్స్‌ ఆడి ఆర్సీబీని గెలిపించాడు.

14 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 156/4
జితేశ్‌ శర్మ 22, మయాంక్‌ అగర్వాల్‌ 32

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
11.2వ ఓవర్‌- 123 పరుగుల వద్ద ఆర్సీబీ నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఆయుశ్‌ బదోనికి క్యాచ్‌ ఇచ్చి విరాట్‌ కోహ్లి (54) ఔటయ్యాడు. 

వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ
వరుస బంతుల్లో ఆర్సీబీ వికెట్లు వికెట్లు కోల్పోయింది. విలియమ్‌ ఓరూర్కీ బౌలింగ్‌లో పాటిదార్‌, లివింగ్‌స్టోన్‌ వరుసగా ఔటయ్యారు.

రెండో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
7.5వ ఓవర్‌- 90 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్‌ కోల్పోయింది. విలియమ్‌ ఓరూర్కీ బౌలింగ్‌లో అబ్దుల్‌ సమద్‌కు క్యాచ్‌ ఇచ్చి రజత్‌ పాటిదార్‌ (14) ఔటయ్యాడు. విరాట్‌కు (42) జతగా లివింగ్‌స్టోన్‌ క్రీజ్‌లోకి వచ్చాడు.  

తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
5.4వ ఓవర్‌- 61 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్‌ కోల్పోయింది. ఆకాశ్‌ సింగ్‌ బౌలింగ్‌లో దిగ్వేశ్‌ రాఠీకి క్యాచ్‌ ఇచ్చి ఫిల్‌ సాల్ట్‌ (30) ఔటయ్యాడు. కోహ్లికి (29) జతగా పాటిదార్‌ క్రీజ్‌లోకి వచ్చాడు.

ఒకే ఓవర్‌లో 4 ఫోర్లు బాదిన కోహ్లి
228 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ కూడా ధాటిగానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. విలియమ్‌ ఓరూర్కీ వేసిన రెండో ఓవర్‌లో కోహ్లి ఏకంగా నాలుగు ఫోర్లు బాదాడు. ఇదే ఓవర్‌లో సాల్ట్‌ కూడా ఓ ఫోర్‌ కొట్టాడు. 3 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 39/0గా ఉంది. సాల్ట్‌ 17, కోహ్లి 21 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

శతక్కొటిన పంత్‌.. లక్నో భారీ స్కోర్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో భారీ స్కోర్‌ (227/3) చేసింది. రిషబ్‌ పంత్‌ (61 బంతుల్లో 118 నాటౌట్‌; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.  మిచెల్‌ మార్ష్‌ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో అలరించాడు. లక్నో ఇన్నింగ్స్‌లో మాథ్యూ బ్రీట్జ్కీ 14, పూరన్‌ 13 పరుగులు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో తుషార, భువనేశ్వర్‌ కుమార్‌, షెపర్డ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

రిషబ్ పంత్‌ సెంచరీ
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌ రిషబ్ పంత్‌ సెంచరీతో చెలరేగాడు. బెంగళూరుతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 50 బంతుల్లో 100 పరుగులు చేశాడు.

రెండో వికెట్‌ కోల్పోయిన లక్నో
15.3వ ఓవర్‌- 177 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్‌ కోల్పోయింది. భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో జితేశ్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి మిచెల్‌ మార్ష్‌ (67) ఔటయ్యాడు. రిషబ్‌ పంత్‌ 83 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. 

14 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్‌ 150/1
మిచెల్‌ మార్ష్‌ 54, రిషబ్‌ పంత్‌ 70

12 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్‌ 127/1
మిచెల్‌ మార్ష్‌ 45, రిషబ్‌ పంత్‌ 58

ధాటిగా ఆడుతున్న పంత్‌
ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌గా బరిలోకి దిగిన రిషబ్‌ పంత్‌ ధాటిగా ఆడుతున్నాడు. 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో మిచెల్‌ మార్ష్‌ ఓ మోస్తరుగా ఆడుతున్నాడు. 19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌ సాయంతో 26 పరుగులు చేశాడు. 9 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్‌ 84/1గా ఉంది.

6 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్‌ 55/1
మిచెల్‌ మార్ష్‌ 15, రిషబ్‌ పంత్‌ 20

తొలి వికెట్‌ కోల్పోయిన లక్నో
2.4వ ఓవర్‌- 25 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్‌ కోల్పోయింది. నువాన్‌ తుషార బౌలింగ్‌లో మాథ్యూ బ్రీట్జ్కీ (14) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ
ఐపీఎల్‌ 2025లో ఇవాళ (మే 27) చివరి లీగ్‌ మ్యాచ్‌ జరుగుతుంది. లక్నో వేదికగా ఎల్‌ఎస్‌జీ, ఆర్సీబీ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

తుది జట్లు..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w/c), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, నువాన్ తుషార

ఇంపాక్ట్ సబ్స్: సుయాష్ శర్మ, రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్.

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, మాథ్యూ బ్రీట్జ్కే, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, విలియం ఓర్కే

ఇంపాక్ట్ సబ్స్ - ఆకాష్ మహరాజ్ సింగ్, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్షిన్ కులకర్ణి, యువరాజ్ చౌదరి
 

#

Tags : 1

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి