Breaking News

IPL 2025: అభిషేక్‌ శర్మతో గొడవ.. దిగ్వేశ్‌ రాఠీపై సస్పెన్షన్‌ వేటు

Published on Tue, 05/20/2025 - 11:21

ఐపీఎల్‌ 2025లో భాగంగా నిన్న (మే 19) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మతో గొడవకు దిగినందుకు గానూ లక్నో బౌలర్‌ దిగ్వేశ్‌ సింగ్‌ రాఠీపై ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చర్యలు తీసుకుంది. రాఠీ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు ఓ మ్యాచ్‌ సస్పెన్షన్‌ విధించింది. రాఠీ కవ్వింపులకు ప్రతిగా  స్పందించిన అభిషేక్‌ కూడా మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోతకు గురయ్యాడు. అభిషేక్‌ ఖాతాలో ఓ డీమెరిట్‌ పాయింట్‌ కూడా జమయ్యింది.

సస్పెన్షన్‌ కారణంగా రాఠీ లక్నో తదుపరి ఆడబోయే మ్యాచ్‌లో (మే 22న గుజరాత్‌తో) ఆడలేడు. ఈ సీజన్‌లోనే ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన 23 ఏళ్ల రాఠీ.. సీజన్‌ ప్రారంభం నుంచి చాలా సార్లు ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ను ఉల్లంఘించి గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆగ్రహానికి గురయ్యాడు. తాజా ఘటనతో ఈ సీజన్‌లో రాఠీ డీ మెరిట్‌ పాయింట్ల సంఖ్య ఐదుకు చేరింది. ఈ కారణంగా అతనిపై ఓ మ్యాచ్‌ సస్పెన్షన్‌ వేటు పడింది. ఓ సీజన్‌లో మూడు సార్లు కోడ్‌ను ఉల్లంఘిస్తే ఓ మ్యాచ్‌ సస్పెన్షన్‌ విధిస్తారు. రాఠీ ఈ సీజన్‌లో పంజాబ్‌ (1), ముంబైతో (2) జరిగిన మ్యాచ్‌ల్లోనూ కోడ్‌ను ఉల్లంఘించి డిమెరిట్‌ పాయింట్లు మూటగట్టుకున్నాడు.

కాగా, దిగ్వేశ్‌ రాఠీ వికెట్‌ తీసిన ప్రతిసారి నోట్‌ బుక్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకోవడం మేనరిజంగా పెట్టుకున్నాడు. ఎవరి వికెట్‌ తీసినా ఇదే తంతు కొనసాగిస్తూ వచ్చాడు. తాజాగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అభిషేక్‌ శర్మ వికెట్‌ తీసిన ఆనందంలో ఇదే పని చేశాడు. అయితే ఈసారి రాఠీ నోట్‌ బుక్‌ సెలబ్రేషన్స్‌ కాస్త శృతి మించాయి. అభిషేక్‌తో అతను చాలా అవమానకరంగా ప్రవర్తించాడు. వికెట్‌ తీశాక వెళ్లు.. వెళ్లు అన్నట్లు సైగ చేశాడు. దీంతో పాటు నోటికి కూడా పని చెప్పాడు.  

రాఠీ ఇంతలా రియాక్డ్‌ కావడానికి అంతకుముందు అభిషేక్‌ బాదిన బాదుడే కారణం. రవి బిష్ణోయ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌లో అభిషేక్‌ వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. ఆతర్వాత ఓవర్‌లో బంతినందుకున్న రాఠీ.. అభిషేక్‌ను తొలి బంతికే ఔట్‌ చేశాడు. ఈ క్రమంలో నోట్‌ బుక్‌ సెలబ్రేషన్స్‌ చేసుకుని ఓ మ్యాచ్‌ సస్పెన్షన్‌కు గురయ్యాడు. మ్యాచ్‌ అనంతరం రాజీవ్‌ శుక్లా రాజీ కుదుర్చడంతో అభిషేక్‌, రాఠీ కరచాలనం చేసుకుని, కలియతిరగడం కొసమెరుపు.

ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ చేతిలో ఓటమిపాలైన లక్నో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో.. ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌ (65), ఎయిడెన్‌ మార్క్రమ్‌ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అభిషేక్‌ శర్మ తన సహజ శైలిలో ఊచకోత (20 బంతుల్లో 59; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) కోసి సన్‌రైజర్స్‌ గెలుపుకు బలమైన పునాది వేశాడు. మధ్యలో ఇషాన్‌ కిషన్‌ (35), క్లాసెన్‌ (47), కమిందు మెండిస్‌ (32 రిటైర్డ్‌ హర్ట్‌) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడగా.. అనికేత్‌ వర్మ (5 నాటౌట్‌), నితీశ్‌ రెడ్డి (5 నాటౌట్‌) మ్యాచ్‌లను లాంఛనంగా ముగించారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్‌ రాఠీ 2, విలియమ్‌ ఓరూర్కీ, శార్దూల్‌ ఠాకూర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

 

Videos

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)