RR VS KKR: మొయిన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు.. క్రెడిట్‌ బౌలర్లకే దక్కుతుంది: రహానే

Published on Thu, 03/27/2025 - 08:26

ధనాధన్‌ బ్యాటింగ్‌ విన్యాసాలతో తొలి ఐదు రోజులు జోరుగా సాగిన ఐపీఎల్‌ 2025 ఆరో రోజు చప్పబడింది. గౌహతి వేదికగా కేకేఆర్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య నిన్న (మార్చి 26) జరిగిన మ్యాచ్‌ పేలగా సాగింది. ఛేదనలో కేకేఆర్‌ ఓపెనర్‌ డికాక్‌ (61 బంతుల్లో 97 నాటౌట్‌; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) భారీ ఇన్నింగ్స్‌ ఆడినా మ్యాచ్‌లో అంత మజా రాలేదు. మ్యాచ్‌ ఏకపక్షంగా సాగడంతో అభిమానులు బోర్‌ ఫీలయ్యారు. 

మ్యాచ్‌ ఇంత చప్పగా సాగడానికి పిచ్‌తో పాటు గౌహతిలో వాతావరణం కారణం. పిచ్‌ నుండి బ్యాటర్లకు పెద్దగా సహకారం లభించలేదు. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం చూపింది. మొత్తంగా రాయల్స్‌ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్‌ సునాయాసంగా ఛేదించింది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్స్‌.. కేకేఆర్‌ బౌలర్లు రెచ్చిపోవడంతో అతి కష్టం మీద 151 పరుగులు చేసింది (9 వికెట్ల నష్టానికి). మొయిన్‌ అలీ (4-0-23-2), వరుణ్‌ చక్రవర్తి (4-0-17-2), హర్షిత్‌ రాణా (4-0-36-2), వైభవ్‌ అరోరా (4-0-33-2) రాయల్స్‌ బ్యాటర్లను బాగా కట్టడి చేశారు. 

స్పిన్నర్లు మొయిన్‌ అలీ, వరుణ్‌ చక్రవర్తి ఆదిలోనే వికెట్లు తీసి రాయల్స్‌పై ఒత్తిడి తెచ్చారు. ఓ దశలో రాయల్స్‌ కనీసం 120 పరుగులైనా చేస్తుందా అనిపించింది. ఎలాగో ముక్కిమూలిగి చివరికి 150 పరుగుల మార్కును తాకగలిగింది. రాయల్స్‌ బ్యాటర్లలో ధృవ్‌ జురెల్‌ (33) టాప్‌ స్కోరర్‌గా కాగా.. జైస్వాల్‌ 29, రియాన్‌ పరాగ్‌ 25, సంజూ శాంసన్‌ 13, జోఫ్రా ఆర్చర్‌ 16 పరుగులు చేశారు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో కేకేఆర్‌ కూడా నిదానంగా ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. పవర్‌ ప్లేలో ఆ జట్టు 41 పరుగులు మాత్రమే చేసిన ఓపెనర్‌గా వచ్చిన మొయిన్‌ అలీ (12 బంతుల్లో 5) వికెట్‌ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్‌ డికాక్‌ బాధ్యతాయుతంగా ఆడి, కెప్టెన్‌ రహానే (18), రఘువంశీ (22 నాటౌట్‌) సహకారంతో కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చాడు. 

కేకేఆర్‌ మరో 15 బంతులు మిగిలుండగానే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో (కేకేఆర్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా) మంచు ప్రభావం కారణంగా రాయల్స్‌ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆ జట్టు తరఫున హసరంగ ఒక్కడే వికెట్‌ (రహానే) తీయగలిగాడు. మొయిన్‌ అలీ రనౌటయ్యాడు.

మ్యాచ్‌ అనంతరం విన్నింగ్‌ కెప్టెన్‌ అజింక్య రహానే మాట్లాడుతూ ఇలా అన్నాడు. తొలి ఆరు ఓవర్లలో మేము బాగా బౌలింగ్ చేసాము. మిడిల్ ఓవర్లు కూడా కీలకమైనవే. స్పిన్నర్లు పరిస్థితులను నియంత్రించిన విధానం బాగుంది. మొయిన్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అతను చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఆటగాళ్లు నిర్భయంగా ఆడాలని కోరుకునే ఫార్మాట్ ఇది. వారికి స్వేచ్ఛ ఇవ్వాలనుకుంటున్నాము.

క్రెడిట్ మా బౌలింగ్ యూనిట్‌కు దక్కుతుంది. వారు ప్రతి బంతికి వికెట్‌ తీయాలనే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మొయిన్. మొయిన్‌ ఓ నాణ్యమైన ఆల్‌రౌండర్‌. గతంలో కూడా అతను ఓపెనింగ్ చేశాడు. బ్యాట్‌తో అతను ఆశించిన సఫలత సాధించలేకపోయినా.. బంతితో రాణించిన విధానం పట్ల సంతోషంగా ఉంది. ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 

కాగా, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన కేకేఆర్‌ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో భంగపడ్డ విషయం తెలిసిందే. కేకేఆర్‌ నెక్స్ట్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఢీకొటుంది. ఈ మ్యాచ్‌ మార్చి 31న వాంఖడేలో జరుగనుంది. 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)