Breaking News

కోల్‌కతా బతికిపోయింది!

Published on Mon, 05/05/2025 - 03:50

వరుసగా  రెండో రోజు మరో ఉత్కంఠ భరిత పోరు. ఆఖరి బంతిదాకా విజయం కోసం రెండు జట్ల సమరం. చివరకు పరుగు తేడాతో ఒక జట్టు గట్టెక్కితే... మరో జట్టు పోరాడి ఓడింది. 6 బంతుల్లో 22 పరుగులు చేస్తేనే రాజస్తాన్‌ రాయల్స్‌ను విజయం వరిస్తుంది. ఇది రాయల్స్‌కు క్లిష్టమైంది. కోల్‌కతాకు కలిసొచ్చేది. వైభవ్‌ అరోరా వేసిన ఈ ఓవర్లో 5 బంతులు ముగిసేసరికి 2, 1, 6, 4, 6లతో 19 పరుగులు వచ్చేశాయి. ఇక 1 బంతి 3 పరుగులు... ఇది ఇరుజట్లను మునికాళ్లపై నిలబెట్టేసింది. అప్పటిదాకా సిక్స్‌లు, ఫోర్‌ బాదిన శుభమ్‌ దూబే భారీషాట్‌ ఆడలేకపోయాడు. ‘టై’ కోసం రెండు పరుగులు తీసే ప్రయత్నం కూడా ఆర్చర్‌ రనౌట్‌తో వృథా ప్రయాసే అయ్యింది. చివరకు ఒకే ఒక్క పరుగుతేడాతో నైట్‌రైడర్స్‌ ఊపిరి పీల్చుకుంది. 

కోల్‌కతా: ఇకపై ప్రతీ మ్యాచ్‌ నెగ్గితేనే ముందుకెళ్లే పరిస్థితుల్లో ఉన్న డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గెలిచి ‘ప్లే ఆఫ్స్‌’ రేసులో నిలిచింది. ఆదివారం ఉత్కంఠరేపిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో రహానే సారథ్యంలోని కోల్‌కతా ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌పై నెగ్గింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఆండ్రీ రసెల్‌ (25 బంతుల్లో 57 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఫిఫ్టీ సాధించాడు. అంగ్‌క్రిష్‌ రఘువంశీ (31 బంతుల్లో 44; 5 ఫోర్లు), గుర్బాజ్‌ (25 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్‌), రహానే (24 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు.

ఆర్చర్, పరాగ్, తీక్షణ, యుధ్‌వీర్‌ తలా ఒక వికెట్‌ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (21 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్‌) జోరు కనబరిచాడు. టాపార్డర్‌లో వైభవ్‌ సూర్యవంశీ (4), కునాల్‌ రాథోడ్‌ (0), మిడిలార్డర్‌లో ధ్రువ్‌ జురేల్‌ (0), హసరంగ (0) నిరాశపరిచినా... కెపె్టన్‌ రియాన్‌ పరాగ్‌ (45 బంతుల్లో 95; 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) వీరోచిత పోరాటం చేశాడు. హెట్‌మైర్‌ (23 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్‌) కీలక దశలో షరామామూలుగా చేతు లెత్తేశాడు. 

శుభమ్‌ దూబే (14 బంతుల్లో 25 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఆఖరి బంతిదాకా జట్టు గెలిచేందుకు నిలిచినా... ఆర్చర్‌ (12) రనౌట్‌తో ఆశలు కూలాయి. మొయిన్‌ అలీ, హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి తలా 2 వికెట్లు పడగొట్టారు. 

స్కోరు వివరాలు 
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి) హెట్‌మైర్‌ (బి) తీక్షణ 35; నరైన్‌ (బి) యు«ద్‌వీర్‌ 11; రహానే (సి) జురేల్‌ (బి) పరాగ్‌ 30; రఘువంశీ (సి) సబ్‌–అశోక్‌ (బి) ఆర్చర్‌ 44; రసెల్‌ (నాటౌట్‌) 57; రింకూ సింగ్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–13, 2–69, 3–111, 4–172. 
బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–30–1, యు«ద్‌వీర్‌ 2–0– 26–1, తీక్షణ 4–0–41–1, ఆకాశ్‌ 3–0– 50–0, హసరంగ 4–0–35–0, పరాగ్‌ 3–0–21–1. 

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) రింకూ సింగ్‌ (బి) మొయిన్‌ అలీ 34; వైభవ్‌ (సి) రహానే (బి) వైభవ్‌ అరోరా 4; కునాల్‌ (సి) రసెల్‌ (బి) మొయిన్‌ అలీ 0; పరాగ్‌ (సి) వైభవ్‌ అరోరా (బి) హర్షిత్‌ 95; ధ్రువ్‌ జురేల్‌ (బి) వరుణ్‌ 0; హసరంగ (బి) వరుణ్‌ 0; హెట్‌మైర్‌ (సి) నరైన్‌ (బి) హర్షిత్‌ 29; శుభమ్‌ దూబే (నాటౌట్‌) 25; ఆర్చర్‌ (రనౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–5, 2–8, 3–66, 4–71, 5–71, 6–163, 7–173, 8–205. బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 4–0–50–1, మొయిన్‌ అలీ 3–0–43–2, హర్షిత్‌ రాణా 4–0–41–2, వరుణ్‌ చక్రవర్తి 4–0–32–2, సునీల్‌ నరైన్‌ 4–0–27–0, రసెల్‌ 1–0–11–0.  

పరాగ్‌... 6 బంతుల్లో 6 సిక్స్‌లు 
ఒకే ఓవర్‌ కాకపోయినా... పరాగ్‌ తానెదుర్కొన్న వరుస ఆరు బంతుల్లో (వైడ్‌ మినహా) ఆరు సిక్సర్లతో చెలరేగాడు. ముందుగా మొయిన్‌ అలీ 12వ ఓవర్లో తొలి బంతికి హెట్‌మైర్‌ పరుగు తీశాడు. 2వ బంతి నుంచి స్ట్రయిక్‌ తీసుకున్న పరాగ్‌ 6, 6, 6, 6, వైడ్, 6లతో ఆ ఓవర్లో 32 పరుగులు వచ్చాయి. మళ్లీ మరుసటి ఓవర్లో హెట్‌మైర్‌ సింగిల్‌ తీయగా, పరాగ్‌ 6 బాదడంతో రెండు ఓవర్లలో వరుసగా 6 బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు. ఈ 8 బంతుల్లో సాధించిన 39 పరుగులతోనే జట్టు లక్ష్యఛేదనలో ఆశలుపెంచింది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)