Breaking News

శుబ్‌మన్‌ గిల్‌కు భారీ షాక్‌!

Published on Sun, 04/20/2025 - 10:29

గెలుపు సంబరంలో ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)కు ఎదురుదెబ్బ తగిలింది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) అతడికి రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals)తో శనివారం నాటి మ్యాచ్‌ సందర్భంగా.. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున ఈ మేరకు శిక్ష విధించింది.

ఇందుకు సంబంధించి ఐపీఎల్‌ పాలక మండలి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్‌ నిబంధనల్లోని ఆర్టికల్‌ 2.22 ప్రకారం.. స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసినందుకు గానూ గిల్‌కు జరిమానా విధించినట్లు తెలిపింది. ఐపీఎల్‌-2025 (IPL 2025) సీజన్‌లో అతడు మొదటిసారి ఈ తప్పిదానికి పాల్పడినందుకు రూ. 12 లక్షలతో సరిపెట్టినట్లు పేర్కొంది.

ఢిల్లీ భారీ స్కోరు
కాగా ఐపీఎల్‌-2025లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌ అహ్మదాబాద్‌ వేదికగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీస్కోరు చేసింది. 

కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ (32 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్స్‌లు), అశుతోష్‌ శర్మ (19 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కరుణ్‌ నాయర్‌ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. 

జోస్‌ ది బాస్‌.. దంచేశాడు
లక్ష్య ఛేదనలో జోస్‌ బట్లర్‌ దంచికొట్టాడు.   వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. కేవలం 54 బంతుల్లోనే 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం. అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.

మరోవైపు.. బట్లర్‌కు తోడుగా షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌ (34 బంతుల్లో 43; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కూడా రాణించాడు.  ఆఖర్లో తెవాటియా మూడు బంతుల్లో 11 పరుగులతో అజేయంగా నిలిచి బట్లర్‌తో కలిసి గుజరాత్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు. 

 

ఢిల్లీ విధించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్‌ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా ఈ సీజన్‌లో ఐదో గెలుపు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకువచ్చింది.

ఐపీఎల్‌-2025: గుజరాత్‌ వర్సెస్‌ ఢిల్లీ
👉వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్‌
👉టాస్‌: గుజరాత్‌.. మొదట బౌలింగ్‌
👉ఢిల్లీ స్కోరు: 203/8 (20)
👉గుజరాత్‌ స్కోరు: 204/3 (19.2)
👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీపై గుజరాత్‌ విజయం
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: జోస్‌ బట్లర్‌ (గుజరాత్‌- 54 బంతుల్లో 97 నాటౌట్‌).

చదవండి: IPL 2025: గెలుపు వాకిట బోర్లా పడిన రాయల్స్‌.. ఉత్కంఠ పోరులో లక్నోను గెలిపించిన ఆవేశ్‌ ఖాన్‌
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)