Breaking News

ఐపీఎల్‌-2025 ఫైన‌ల్ వేదిక, తేదీ మార్పు?

Published on Sun, 05/11/2025 - 19:20

ఐపీఎల్‌-2025 సీజ‌న్‌ను తిరిగి ప్రారంభించేందుకు బీసీసీఐ సిద్ద‌మ‌వుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు లభిస్తే మే 15 లేదా 16వ తేదీన ఐపీఎల్ తిరిగి మొద‌ల‌య్యే అవ‌కాశ‌ముంది. మంగళవారం (మే 13) నాటికి ఆటగాళ్లందరినీ జట్టుతో చేరేలా చూసుకోవాలని ఫ్రాంఛైజీలకు ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్‌ ఆదేశాలు జారీ చేసినట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో బీసీసీఐ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్ ఫైన‌ల్ వేదిక‌ను మార్చాల‌ని భార‌త క్రికెట్ బోర్డు యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. షెడ్యూల్ ప్రకారం.. మే 25న కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గాల్సి ఉంది. 

ఇప్పుడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియానికి ఫైన‌ల్ వేదిక‌ను మార్చ‌నున్న‌ట్లు ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఫైన‌ల్ మ్యాచ్ తేదీలో కూడా మార్పు చోటు చేసుకోనున్న‌ట్లు ఐపీఎల్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. మే 25 బ‌దులుగా మే 30న తుది పోరు జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కాగా భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య ఉద్రిక్త‌ల కార‌ణంగా ఐపీఎల్‌-2025ను బీసీసీఐ వారం రోజుల పాటు  తాత్కాలికంగా వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. అయితే మిగిలిన మ్యాచ్‌ల‌కు విదేశీ ఆట‌గాళ్ల అందుబాటుపై సందిగ్ధ‌త కొన‌సాగుతోంది. చాలా మంది ఫార‌న్ ప్లేయ‌ర్లు ఇప్ప‌టికే త‌మ స్వ‌దేశాల‌కు వెళ్లిపోయారు.
చ‌దవండి: IND vs SL: ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్ విజేత‌గా భార‌త్.. ఫైన‌ల్లో శ్రీలంక చిత్తు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)