Breaking News

సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్‌ ద్రవిడ్‌

Published on Sat, 04/19/2025 - 10:52

రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson)తో విభేదాలంటూ వచ్చిన వార్తలపై.. ఆ జట్టు హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) స్పందించాడు. ఇలాంటి వదంతులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని.. సంజూ, తానూ జట్టు ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తామని స్పష్టం చేశాడు. కాగా ఐపీఎల్‌-2025 (IPL 2025)లో రాజస్తాన్‌ రాయల్స్‌ వైఫల్యాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఇద్దరికీ గాయాల బెడద
ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో రాయల్స్‌ కేవలం రెండు మాత్రమే గెలిచింది. మరోవైపు.. హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ సంజూ శాంసన్‌ గాయాల బారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ సీజన్‌ ఆరంభానికి ముందు ద్రవిడ్‌ లీగ్‌ మ్యాచ్‌ ఆడి కాలికి దెబ్బ తాకించుకోగా.. వీల్‌చైర్‌లో కూర్చునే జట్టుకు మార్గదర్శనం చేస్తున్నాడు.

ఇంపాక్ట్‌ ప్లేయర్‌గానే
ఇక సంజూ పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించని కారణంగా తొలి మూడు మ్యాచ్‌లలో కేవలం ఇంపాక్ట్‌ ప్లేయర్‌గానే బరిలోకి దిగాడు. ఆ తర్వాత సారథిగా పగ్గాలు చేపట్టిన ఈ కేరళ బ్యాటర్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా మరోసారి గాయపడ్డాడు. పక్కటెముకల నొప్పితో అతడు తదుపరి లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌కు దూరమయ్యే పరిస్థితి.

ద్రవిడ్‌- సంజూ మధ్య విభేదాలు?
ఇదిలా ఉంటే.. ఢిల్లీపై గెలవాల్సిన మ్యాచ్‌ను రాయల్స్‌ చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఇరు జట్లు సరిగ్గా 188 పరుగులే చేయడంతో మ్యాచ్‌ ‘టై’ కాగా.. సూపర్‌ ఓవర్లో ఢిల్లీ రాయల్స్‌పై జయభేరి మోగించింది. అయితే, సూపర్‌ ఓవర్‌కు ముందు ద్రవిడ్‌ ఆటగాళ్లతో డగౌట్‌లో చర్చలు జరుపగా.. సంజూ మాత్రం అందులో పాలుపంచుకోలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొట్టగా.. ద్రవిడ్‌- సంజూ మధ్య విభేదాలనే వదంతులు వచ్చాయి.

అతడు జట్టులో అంతర్భాగం
అయితే, ఈ వార్తలను ద్రవిడ్‌ ఖండించాడు. లక్నోతో శనివారం నాటి మ్యాచ్‌ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో నాకైతే అర్థం కావడం లేదు. నేను, సంజూ ఒకే విధంగా ఆలోచిస్తాం. మా ప్రణాళికలు ఒక్కటే.

అతడు జట్టులో అంతర్భాగం. ప్రతి చర్చ, నిర్ణయంలోనూ అతడు భాగమై ఉంటాడు. అయితే, కొన్నిసార్లు మనం అనుకున్న ఫలితాలు రాకపోతే ప్రతి ఒక్కరు నిరాశ చెందుతారు. ఆటలో ఇవన్నీ సహజం.

మన ప్రదర్శన బాగా లేకపోతే విమర్శలు వస్తూనే ఉంటాయి. కానీ ఇలా ఆధారాల్లేకుండా వస్తున్న వార్తలను మేమైతే అరికట్టలేము. మా జట్టులోనూ ఎలాంటి విభేదాలు లేవు.

మా వాళ్లు కఠినంగా శ్రమిస్తున్నారు. గెలుపు కోసం కృషి​ చేస్తున్నారు. తమ ప్రదర్శన బాగాలేకపోతే ఆటగాళ్ల మనసు ఎంతగా గాయపడుతుందో మీకు తెలియదు. ఎవరో పనిగట్టుకుని వారిని విమర్శించాల్సిన పనిలేదు. పొరపాట్లను సమీక్షించుకుని సరిచేసుకోగల సత్తా వారికి ఉంది’’ అని ద్రవిడ్‌ విమర్శకులకు, వదంతులు వ్యాప్తి చేసే వారికి చురకలు అంటించాడు.

చదవండి: సచిన్‌ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్‌.. ఐపీఎల్‌ చరిత్రలో భారత తొలి బ్యాటర్‌గా

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు